అన్వేషించండి

MS Dhoni Treatment: ధోనీకి మోకాళ్ల నొప్పులు! ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఛాంపియన్‌!

MS Dhoni Treatment: మహేంద్ర సింగ్‌ ధోనీ అభిమానులకు షాక్‌! మైదానంలో చిరుతలా పరుగెత్తే ఈ ఛాంపియన్‌ ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు.

MS Dhoni Treatment:  మహేంద్ర సింగ్‌ ధోనీ అభిమానులకు షాక్‌! మైదానంలో చిరుతలా పరుగెత్తే ఈ ఛాంపియన్‌ ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు. రాంఛీలోని ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం అతడు గాయాల నుంచి కోలుకుంటున్నాడని సమాచారం.

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రెండు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు స్థానిక ఆయుర్వేద నిపుణుడైన వందన్‌ సింగ్‌ను కలిశాడు. ఇప్పటికీ చికిత్స కొనసాగిస్తున్నాడు. కొన్ని మూలికలు వేసుకొని పాలు తాగాలని వైద్యుడు ఆయనకు సూచించారు. నెల రోజుల క్రితమే ధోనీ ఒక డోసు ఔషధం తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాతి డోసుకు ఎప్పుడొస్తాడో తెలియదన్నారు.

మొదట ధోనీ గురించి తనకు అంతగా తెలియదని వందన్‌ సింగ్‌ అన్నారు. జనాలు వచ్చి ఫొటోలు తీసుకొనేందుకు ఎగబడటంతో అతడి గురించి తెలిసిందన్నారు. రెండు మూడు నెలలుగా ధోనీ తల్లిదండ్రులు సైతం ఆయన వద్దకే చికిత్స కోసం వస్తున్నారని టైమ్స్‌ నౌ రిపోర్టు చేసింది. ఆ తర్వాత మోకాళ్లలో అసౌకర్యంగా అనిపించడంతో ధోనీ సైతం ఆయన వద్దకే వచ్చాడు. రూ.40 విలువైన ఔషధం తీసుకున్నాడు.

Also Read: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

Also Read: ఆడకూడని బంతులకు ఓపెనర్లు ఔట్‌ - లంచ్‌కు టీమ్‌ఇండియా 53-2

ఇదే సీజన్ చివరిది అనుకుంటున్న అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ ఐపీఎల్‌ 2022 ముగియగానే గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడని కన్ఫామ్ చేసింది. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.

గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్ లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందన్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget