By: ABP Desam | Updated at : 01 Jul 2022 05:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
విరాట్ కోహ్లీ ( Image Source : BCCI )
IND vs ENG 5th Test: భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు తొలిరోజే నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. మొదటి రోజు భోజన విరామానికి టీమ్‌ఇండియా 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (1; 7 బంతుల్లో), హనుమ విహారి (13; 46 బంతుల్లో 1x4) బ్యాటింగ్ చేస్తున్నారు. 20.1 ఓవర్లు ముగియగానే ఎడ్జ్‌బాస్టన్‌లో చిరు జల్లులు మొదలయ్యాయి. వాన మరింత ముదరడంతో సిబ్బంది మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాంతో 20 నిమిషాల ముందుగానే భారత్ లంచ్‌కు వెళ్లింది.
అండర్సన్‌కే 2 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 27 వద్దే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (17; 24 బంతుల్లో 4x4) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి గిల్ మంచి టచ్‌లో కనిపించాడు. చక్కని బౌండరీలు బాదాడు. భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే అండర్సన్ వేసిన 6.2వ బంతిని అనవసరంగా ఎదుర్కొన్నాడు. మిడిల్ చేసినా పరుగు రాని బంతిని ఆడాడు. దాంతో ఎడ్జ్ అయిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. క్రాలీ సులువగా దానిని పట్టేశాడు. నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (13; 46 బంతుల్లో 2x4) జట్టు స్కోరు 46 వద్ద ఔటయ్యాడు. అండర్సన్ చక్కని లైన్ అండ్ లెంగ్త్‌లో వేసిన బంతి బ్యాటు అంచుకు తగిలి క్రాలీ చేతుల్లో పడింది. ఈ సిరీసులో పుజారాను జిమ్మీ ఔట్ చేయడం ఇది ఐదోసారి.
Also Read: ఐదో టెస్టు లైవ్ స్ట్రీమింగ్ ఎందులో? ఫ్రీగా లైవ్ చూడొచ్చా?
Also Read: కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్‌లు - నిర్ణయాత్మక టెస్టులో ఏ జట్టు బలమేంటి?
ఇంగ్లాండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
భారత్: శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా , హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Jimmy is back with a 💥
— England Cricket (@englandcricket) July 1, 2022
Scorecard/Videos: https://t.co/jKoipF4U01
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/dalxxQ26yQ
Early Lunch has been taken.#TeamIndia 53/2 at Lunch on Day 1 https://t.co/xOyMtKJzWm #ENGvIND
— BCCI (@BCCI) July 1, 2022
Weather permitting, second session to restart at 12.48 PM local time (5.18 PM IST) pic.twitter.com/Xmxv2QIYRq
Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి
BAN vs NZ 2nd Test match: విచిత్రంగా అవుటైన ముష్ఫీకర్ రహీమ్, అలా అవుటైన తొలి బంగ్లా క్రికెటర్!
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Ayodhya Temple consecration ceremony: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం- సచిన్, కోహ్లీలకు ఆహ్వానం
Cyclone Michaung: నీట మునిగిన చెన్నై, క్రికెటర్ల ఆవేదన
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
/body>