IND vs ENG Live streaming: ఐదో టెస్టు లైవ్ స్ట్రీమింగ్ ఎందులో? ఫ్రీగా లైవ్ చూడొచ్చా?
India vs England Live Streaming: అత్యంత కీలకమైన మ్యాచుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో తలపడుతోంది. మ్యాచ్ వేదిక, లైవ్ టెలికాస్ట్, అంచనా జట్ల వివరాలు ఇవీ!
India vs England Live Streaming: సుదీర్ఘ ఫార్మాట్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో తలపడుతోంది. గతేడాది మొదలైన ఈ సిరీసులో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. కరోనా వల్ల అప్పడు ఆఖరి పోరు వాయిదా పడింది. ఆ మ్యాచ్ ఇప్పుడు జరుగుతోంది. మ్యాచ్ వేదిక, లైవ్ టెలికాస్ట్, అంచనా జట్ల వివరాలు ఇవీ!
When Does India vs England 5th test match Begin (Date and Time in India)?
భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టు వేదిక బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్‌నం రెండు గంటలకు టాస్ వేస్తారు. 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs England 5th test match?
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో మ్యాచ్ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ సిక్స్ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
How to Watch India vs England 5th test match Live Streaming Online for Free in India?
భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టును లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
India vs England Series
ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా మొదట టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడుతుంది.
India vs England 5th test match ProbableXI
ఇంగ్లాండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
భారత్: శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా / మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ / అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
💬 💬 "It's a huge honour to lead #TeamIndia."@Jaspritbumrah93 sums up his emotions as he is all set to captain the side in the 5⃣th rescheduled Test against England. 👍 👍#ENGvIND pic.twitter.com/jovSLbuN7e
— BCCI (@BCCI) July 1, 2022