MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్ లైన్ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!
MS Dhoni Har Ghar Tiranga: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి దేశభక్తిని చాటుకున్నాడు! భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.
MS Dhoni Har Ghar Tiranga: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరోసారి దేశభక్తిని చాటుకున్నాడు! భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ పిక్స్‌ను మార్చేశాడు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మువ్వన్నెల జెండాను ఇన్‌స్టాగ్రామ్ డీపీగా పెట్టుకున్నాడు.
MS Dhoni changes his Instagram DP for Independence Day. pic.twitter.com/Ucznok9OFg
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2022
భారత ఈ ఏడాది 75వ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇప్పటికే కోట్లాది మంది భారతీయులు తమ డీపీలను మార్చుకున్నారు. అనేకమంది సెలెబ్రిటీలూ ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ధోనీ వారికి జత కలిశాడు.
సాధారణంగా మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. ఎక్కువ పోస్టులు పెట్టడు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో డీపీని మార్చుకున్నాడు. 'నేను భారతీయుడిగా జన్మించడం గొప్ప ఆశీర్వాదం' అని ఇంగ్లిష్, హిందీ, సంస్కృతంలో పోస్టు చేశాడు. అతడు దేశభక్తిని చాటుకోవడం ఇదే తొలిసారి కాదు. తన కుమార్తె జీవా పుట్టినప్పుడూ అక్కడ లేడు. టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేశాడు.
Dhoni & his love for INDIA 🇮🇳❤#WhistlePodu | @MSDhoni | #MSDhoni pic.twitter.com/2RSGHLPxzi
— CSK Fans Army™ (@CSKFansArmy) August 13, 2022
'నాకు అమ్మాయి పుట్టింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇప్పటికైతే నేను జాతీయ బాధ్యతల్లో ఉన్నాను. మిగతావాళ్లు నాకోసం ఎదురు చూడక తప్పదు. ప్రపంచకప్ మాకు అత్యంత కీలకం' అని ధోనీ అప్పుడు అన్నాడు. వీలు దొరికినప్పుడల్లా అతడు భారత సైన్యంలో పనిచేసే సంగతి తెలిసిందే.
View this post on Instagram
View this post on Instagram