అన్వేషించండి

Malaysia Open badminton 2024: చరిత్రకు అడుగు దూరంలో , ఫైనల్లో సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి

Malaysia Open badminton 2024: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.

భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి((Satwiksairaj Rankireddy-Chirag Shetty) )కొత్త సీజన్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది. మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament)లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌ జోడీ  21-18, 22-20 తేడాతో సౌత్‌ కొరియన్‌ జంట కంగ్‌ మిన్‌ హ్యూక్‌ – సీయో స్యూంగ్‌ జేలను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌ చేరడం ద్వారా మలేషియా ఓపెన్‌ డబుల్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారత జోడీగా సాత్విక్‌, చిరాగ్‌ జోడీ రికార్డులకెక్కింది. 44 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ పోరులో సాత్విక్‌ జోడీ.. రెండు సెట్లలోనూ గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. రెండో సెట్‌లో ఒకదశలో 11-18తో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో నిలిచిన భారత జోడీ.. అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. ఫైనల్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ గెలిస్తే సూపర్‌ 1000 విభాగంలో వారికి రెండో టైటిల్‌ కానుంది.

చైనా మస్టర్స్‌లో ఓటమి
 భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీకి షాక్‌ తగిలింది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్‌ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ లియాంగ్‌- వాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.

ఇటీవలే ఖేల్‌రత్న అందుకున్న చిరాగ్‌
కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఖేల్ రత్న, ద్రోణాచర్య, అర్జున అవార్డు (Arjuna Awards 2023)లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి (Chirag Shetty), ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్‌ (Satwiksairaj Rankireddy) లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)ను ప్రకటించారు. క్రీడల్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 26 మందిని అర్జున అవార్డు వరించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget