(Source: ECI/ABP News/ABP Majha)
Lionel Messi Robbed: ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం.. మ్యాచ్ నుంచి హోటల్ రూమ్‌కు వచ్చి చూస్తే షాక్
Messi Robbed: ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ పూర్తిచేసుకుని తిరిగి హోటల్ గదికి వచ్చిన మెస్సీ అక్కడ పరిస్థితి చూసి షాకయ్యాడు.
Lionel Messi Robbed: ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన లియోనెల్ మెస్సీని సైతం వదల్లేదు దొంగలు. అర్జెంటీనా ఆటగాడైన మెస్సీ పీఎస్జీ క్లబ్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ పూర్తిచేసుకుని తిరిగి హోటల్ గదికి వచ్చేసరికి దొంగలు అతని హోటల్ గదిలోని నగలు, నగదు చోరీ చేశారు. పారిస్ లోని ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. ఈ హోటల్‌లో నాలుగు గదులు అద్దెకు తీసుకుని మెస్సీ, తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. ఈ క్రమంలో వారు లేని సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
బార్సిలోనా క్లబ్‌కు గుడ్ బై..
గత కొన్నేళ్లుగా బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. బార్సిలోనా క్లబ్ నుంచి బయటకు వచ్చిన మెస్సీ ఇటీవల పారిస్ సెయింట్ జెర్మేన్(పీఎస్‌జీ) క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అర్జెంటీనా ఆశాకిరణంగా పిలుచుకునే లియోనెల్ మెస్సీ తన మకాంను కొన్ని రోజుల కిందట మార్చేశాడు. కానీ తన గదిలో చోరీ జరగడంతో ఆశ్చర్యపోయాడు. మెస్సీ భార్యకు చెందిన విలువైన ఆభరణాలు సైతం చోరీకి గురయ్యాయి.
Also Read: లంక టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు.. కొత్తగా ఐదుగురి ఎంపిక!
ఫ్యామిలీతో కలిసి హోటల్‌లో నివాసం..
పారిస్ క్లబ్‌తో ఒప్పందం కారణంగా ఇక్కడి మకాం మార్చాడు. అక్కడ ప్రస్తుతం లే రాయల్ మోనెక్ అనే విలాసవంతమైన హోటల్‌లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మెస్సీ, అతడి భార్య, ముగ్గురు పిల్లలతో గత కొంతకాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం అతడి ఇంటికి మరమ్మతులు జరుగుతున్నందున హోటల్‌లో వీరు బస చేస్తున్నారు. ఈ క్రమంలో మెస్సీ పీఎస్జీ క్లబ్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు. అతడి కుటుంబం సైతం బయటకు వెళ్లడంతో కొందరు మెస్సీ హోటల్ గదిపై నిఘా ఉంచారు. హోటల్ గదిలో బాల్కనీ డోర్ అద్దాలు పగలగొట్టిన నిందితులు మెస్సీ రూములోకి ప్రవేశించారు. 40 వేల డాలర్ల విలువ కలిగిన బంగారు ఆభరణాలు, 15 వేలకు పైగా డాలర్ల సొత్తు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
Also Read: విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్... విజేతగా నిలిచిన సౌరవ్ భట్టాచార్య
రెంట్ ఎంతో తెలుసా..
ప్రస్తుతం హోటల్ లో 4 గదులు అద్దెకు తీసుకుని ఉంటున్న మెస్సీ ఒక్కరోజుకు 23,000 డాలర్లు చెల్లిస్తున్నాడు. స్టార్ ఆటగాడు, అందులోనూ ధనవంతుడు కావడంతో దొంగలు అతడి గదిపై నిఘా ఉంచారు. మెస్సీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లడం, కుటుంబ సభ్యులు లేని సమయం చూసి దొంగలు బాల్కనీ నుంచి, పైకప్పు నుంచి మెస్సీ పోర్షన్‌లోకి ప్రవేశించి చోరీ చేశారు. జరిగిన చోరీ ఘటనపై పోలీసులకు మెస్సీ ఫిర్యాదు చేశాడు. అయితే ప్రముఖ ఆటగాడి రూమ్‌కు సైతం సరైన భద్రత లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!