అన్వేషించండి

Smriti Mandhana Century: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!

గులాబి టెస్టులో శతకం బాదిన భారత రెండో క్రికెటర్‌గా స్మృతి మంధాన అవతరించింది. విరాట్‌ కోహ్లీ సరసన చేరింది. మరోవైపు ఔటివ్వకున్నా పెవిలియన్‌కు వెళ్లిన పూనమ్‌ రౌత్‌కు ప్రపంచం ఫిదా అయ్యింది.

టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంధాన దుమ్మురేపింది! గులాబి టెస్టులో శతకం చేసిన భారత రెండో క్రికెటర్‌, తొలి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరసన నిలిచింది. తన బ్యాటింగ్‌కు తిరుగులేదని చాటిచెప్పింది. ఆసీస్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఆమె ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే!

Also Read: జోరు మీదున్న కోల్‌కతా.. ఒత్తిడిలో పంజాబ్.. మ్యాచ్ నేడే!

మైమరిపించిన మంధాన
తొలిరోజు 80 పరుగులతో నిలిచిన స్మతి మంధాన (127; 216b 22x4, 1x4) రెండో రోజు తనదైన రీతిలో ఆడింది. పూనమ్‌ రౌత్‌ (36; 165b 2x4)తో రెండో వికెట్‌కు 102 పరుగులు విలువైన భాగస్వామ్యం అందించింది. ఈ క్రమంలోనే ఆమె గులాబి బంతితో తొలి శతకం బాదేసింది. ఇందుకు 170 బంతుల్నే తీసుకుంది. ఎలిస్‌ పెర్రీ, డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్‌నర్‌, సోఫీ మోలినెక్స్‌ వంటి బౌలర్లను ఎదుర్కొంది. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే అందివచ్చిన బంతుల్ని బౌండరీకి బాదేసింది. భారీ స్కోరు వైపు పరుగులు తీస్తున్న ఆమెను జట్టు స్కోరు 195  వద్ద గార్డనర్‌ ఔట్‌ చేసింది. దాంతో రెండో రోజు డిన్నర్‌ సమయానికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.  మిథాలీ రాజ్‌ (15), యస్తికా భాటియా (2) క్రీజులో ఉన్నారు.

Also watch: కొహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! సయోధ్య కోసమే ధోనీకి మెంటార్‌షిప్‌?

పూనమ్‌ క్రీడాస్ఫూర్తికి ఫిదా
ఈ మ్యాచులో టీమ్‌ఇండియా బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ (36; 165b 2x4) ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది. స్మృతి మంధానకు ఆమె తోడుగా నిలిచింది. చక్కని సహకారం అందించింది. అర్ధశతకం వైపు పరుగులు తీస్తున్న ఆమెను 80.4వ బంతికి మోలినెక్స్‌ ఔట్‌ చేసింది. నిజానికి ఆమె ఆడిన బంతి బ్యాట్‌ అంచుకు  తగిలి కీపర్‌ చేతుల్లో పడింది. అయితే బ్యాటుకు బంతి తాకినట్టే అనిపించలేదు. అంపైర్‌ ఔటివ్వనప్పటికీ పూనమ్‌ రౌత్‌ క్రీజును వదిలి వెళ్లిపోయింది. దాంతో ఆమె క్రీడాస్ఫూర్తికి అంతా ఫిదా అయ్యారు. ఆమెను మెచ్చుకుంటున్నారు.

Also Read: అబ్బో.. ఐపీఎల్‌ను తెగ చూసేస్తున్నారుగా! 40 కోట్లు దాటనున్న వీక్షకులు

ఇద్దరూ ఇద్దరే!
ఇప్పటి వరకు భారత్ తరఫున గులాబి టెస్టుల్లో ఇద్దరు మాత్రమే సెంచరీలు బాదేశారు. పురుషుల క్రికెట్లో బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టగా మహిళల క్రికెట్లో స్మృతి మంధాన ఆసీస్‌ చేసింది. దాంతో ఆమెను అతడితో పోలుస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. 18వ నంబర్‌ జెర్సీ వేసుకున్న వాళ్ల ఆటతీరు ఇలాగే ఉంటుందని అంటున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget