AP Amateur Golf tournament: విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్... విజేతగా నిలిచిన సౌరవ్ భట్టాచార్య
విశాఖలో నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో ఢిల్లీ గోల్ఫో కబ్ల్ కు చెందిన సౌరవ్ భట్టాచార్య విజేతగా నిలిచారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇండియన్ గోల్ఫ్ యూనియన్ (IGU) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి ఆంధ్రప్రదేశ్ ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌కు చెందిన సౌరవ్ భట్టాచార్య విజేతగా నిలిచారు. అయితే నోయిడా జేపీ గ్రీన్స్ కి చెందిన అర్జున్ భాటి, పూణే గోల్ఫ్ క్లబ్‌కు చెందిన రోహన్ ధోలే పాటిల్‌లు మొదటి, రెండో రన్నరప్ గా నిలిచారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్(EPGC)లో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ (EPGC) ప్రెసిడెంట్, వైస్ అడ్మ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ బిశ్వజిత్ దాస్ గుప్తా విజేతలకు బహుమతులు అందజేశారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 01 వరకు ఈ పోటీలు జరిగాయి. విశాఖపట్నం నుంచి 5 మంది గోల్ఫ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ
ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ వైస్ అడ్మ్ దాస్‌గుప్తా అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో తొలి ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించినందుకు ఈపీజీసీని ఎంపిక చేసినందుకు ఇండియన్ గోల్ఫ్ యూనియన్ కి కృతజ్ఞతలు తెలిపారు. గులాబ్ తుపాను కారణంగా నగరంలో 310 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నప్పటికీ టోర్నమెంట్‌ను ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించారన్నారు. ఈపీజీసీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు మొట్టమొదటి జాతీయ స్థాయి ఔత్సాహిక గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌కు క్లబ్ ఆతిథ్యం ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో క్లబ్ అనేక జాతీయ స్థాయి టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఈపీజీసీకి ఇండియన్ గోల్ఫ్ యూనియన్ మద్దతు కొనసాగించాలని కోరారు.
Also Read: లంక టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు.. కొత్తగా ఐదుగురి ఎంపిక!
Also Read: ఎవరు మంచోడు? ఎవరు చెడ్డోడు? క్రీడాస్ఫూర్తిపై విమర్శించిన వారికి అశ్విన్ ఘాటు సందేశం!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
Also Read: రైజర్స్ మళ్లీ పాత పాటే.. హైదరాబాద్‌పై ఆరు వికెట్లతో చెన్నై విజయం!
Also Read: అబ్బో.. ఐపీఎల్‌ను తెగ చూసేస్తున్నారుగా! 40 కోట్లు దాటనున్న వీక్షకులు