SL on T20 WC: లంక టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పులు.. కొత్తగా ఐదుగురి ఎంపిక!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో శ్రీలంక క్రికెట్ బోర్డు మరో ఐదుగురిని కొత్తగా చేర్చింది. అంటే మొత్తం 23 మంది జట్టులో ఉంటారు. అక్టోబర్ 3న జట్టు ఒమన్‌కు బయల్దేరుతుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో శ్రీలంక క్రికెట్ బోర్డు మార్పులు చేసింది. మరో ఐదుగురు క్రికెటర్లను జట్టులో చేర్చింది. లక్షణ్ సందకన్, రమేశ్ మెండిస్, పాథుమ్ నిసంక, మినోద్ భనుకా, అషెన్ బండారాను కొత్తగా ఎంపిక చేశారు. ఇంతకు ముందే మదుశనకను ఎంపిక చేయగా అతడు జట్టుతో పాటు వెళ్లడం లేదు. అతడింకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.
Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
'ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో శ్రీలంక క్రికెట్ బోర్డు మరో ఐదుగురిని కొత్తగా చేర్చింది. అంటే మొత్తం 23 మంది జట్టులో ఉంటారు. అక్టోబర్ 3న జట్టు ఒమన్‌కు బయల్దేరుతుంది' అని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
గత వారం లంక బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనెను ప్రపంచకప్ జట్టుకు సలహాదారుగా నియమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు ముంబయి ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. గతేడాది జట్టుకు ట్రోఫీ అందించాడు. పైగా దుబాయ్, అబుదాబి,షార్జా పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. అతడు ఐపీఎల్ బయో బుడగ నుంచి నేరుగా ప్రపంచకప్ బుడగకు బదిలీ అవుతాడు.
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
శ్రీలంక జట్టు: దసున్ శనక (కె), ధనంజయ డిసిల్వా, కుశాల్ జనిత్ పెరీరా, దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, చరిత్ అసలంక, వనిందు హసరంగ, కామిందు మెండిస్, చమిక కరుణరత్నె, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, ప్రవీన్ జయవిక్రమ, మహీశ్ తీక్షణ, పాథుమ్ నిసంక, మినోద్ భనుకా, లక్షణ్ సందకన్, రమేశ్ మెండిస్, అషెన్ బండారా.
రిజర్వు ఆటగాళ్లు: లాహిరు కుమార, బినురా ఫెర్నాండో, అఖిల ధనంజయ, పులిన తరంగ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sri Lanka Cricket’s Selection Committee included 05 more additional players to join the Sri Lanka squad taking part in the ICC Men’s #T20WorldCup 2021.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 1, 2021
Pathum Nissanka
Minod Bhanuka
Ashen Bandara
Lakshan Sandakan
Ramesh Mendishttps://t.co/EvtKitqovD