Chris Gayle Update: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
కేకేఆర్ మ్యాచ్‌కు ముందు క్రిస్‌గేల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ బయో బుడగ వీడాడు. టీ20 ప్రపంచకప్‌నకు తాజాగా ఉండేందుకే అతడీ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.
యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ బయో బుడగను వీడాడు. టీ20 ప్రపంచకప్ ముందు మానసికంగా తాజాగా ఉండేందుకే ఇలా చేశానని తెలిపాడు. తనకు అనుమతి ఇచ్చినందుకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశాడు.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
కరోనా మహమ్మారి తర్వాత క్రికెట్ టోర్నీల పరిస్థితి మారిపోయింది. ఆట కోసం విపరీతంగా బయో బుడగల్లో ఉండాల్సి వస్తోంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులూ తోడుగా ఉండటం లేదు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బయో బుడగ నిబంధనలు కఠినంగా ఉంటున్నాయి. బయటకు వెళ్లలేక పోతున్నారు. మానసికంగా అలసిపోతున్నారు. దాంతో మధ్యలోనే బుడగను వీడుతున్నారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అందుకోసమే భారత్‌తో సిరీసు, ఐపీఎల్ ఆడటం లేదు. తాజాగా క్రిస్‌గేల్ అతడి బాటలోనే నడిచాడు.
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
'కొన్ని నెలలుగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ బుడగలో ఉన్నాను. వెంటనే ఐపీఎల్ బుడగకు వచ్చేశాను. అందుకే మానసికంగా తాజాగా ఉండాలని అనుకున్నా. వెస్టిండీస్‌కు టీ20 ప్రపంచకప్ అందించాలన్నది నా ఉద్దేశం. అందుకే దుబాయ్‌లో విరామం తీసుకున్నాను. బుడగ వీడేందుకు అనుమతి ఇచ్చినందుకు పంజాబ్ కింగ్స్‌కు ధన్యవాదాలు. మున్ముందు మ్యాచుల్లో వారు గెలవాలని కోరుకుంటున్నా' అని గేల్ అన్నాడు.
Also Read: జోరు మీదున్న కోల్‌కతా.. ఒత్తిడిలో పంజాబ్.. మ్యాచ్ నేడే!
'నేను క్రిస్‌గేల్‌ను ఎదుర్కొన్నాను. పంజాబ్ కింగ్స్‌లో అతడికి కోచ్‌గా ఉన్నాను. అతడెంత ప్రొఫెషనల్‌గా ఉంటాడో నాకు తెలుసు. టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమవ్వాలన్న అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం' అని పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. కాగా బుడగ జీవితం కఠినంగా ఉంటుందని గేల్ తెలిపాడు. మానసికంగా ఒత్తిడి ఉంటోందని పేర్కొన్నాడు. కానీ క్రికెటర్లకు ఈ పోరాటం తప్పదని వెల్లడించాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
#PBKS respects and supports the decision of @henrygayle.
— Punjab Kings (@PunjabKingsIPL) September 30, 2021
Wishing him all the success for the upcoming #T20WorldCup!#SaddaPunjab #IPL2021 #PunjabKings https://t.co/QmTqhd8w6k
.@mayankcricket in the nets is something we can watch all day long! 😍#SaddaPunjab #IPL2021 #PunjabKings pic.twitter.com/24kZJ53HUE
— Punjab Kings (@PunjabKingsIPL) October 1, 2021