అన్వేషించండి

Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!

IPL 2026 :ఐపీఎల్ 2026 అరంగేట్రం మ్యాచ్‌లోనే విదర్భ పేసర్ ప్రఫుల్ హింగే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్‌పై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి చరిత్రకెక్కాడు. ప‌వ‌ర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీశాడు.

IPL 2026 SRH VS RR Live Updates: ఐపీఎల్ 2026 సీజన్ ఒక అదిరిపోయే యువ పేసర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున బరిలోకి దిగిన విదర్భ కుర్రాడు ప్రఫుల్ హింగే తన మొదటి మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అరంగేట్రం చేశాడు. సాధారణంగా మొదటి మ్యాచ్ ఆడేటప్పుడు ఏ ప్లేయర్ అయినా ఒత్తిడికి గురవుతాడు. కానీ, ప్రఫుల్ మాత్రం అనుభవజ్ఞుడైన బౌలర్ లాగా బంతిని సంధించాడు. కేవలం తన మొదటి ఓవర్‌లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపి యావత్ స్టేడియాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మ‌రోవైపు ఈ మ్యాచ్ లో ప్ర‌ఫుల్, బీహార్ కు చెందిన స‌ఖీబ్ హుస్సేన్ కూడా డెబ్యూ చేశాడు. త‌ను కూడా ఒక వికెట్ తీయ‌డం విశేషం. 

చరిత్రలో నిలిచిపోయే ఆ ఒక్క ఓవర్..
రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బ‌రిలోకి దిగ‌గా,  కెప్టెన్ ఇషాన్ కిష‌న్ బంతిని ప్రఫుల్ చేతికి ఇచ్చాడు. ఆ ఓవర్ స్టాట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 1, W, 0, W, 0, W తో ప్రఫుల్ ఒక అదిరే స్పెల్ వేశాడు. లీగ్ లోనే ప్రమాదకరమైన బ్యాటర్లుగా పేరున్న వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి ప్లేయర్లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ఇతని టాలెంట్‌కు నిదర్శనం. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్ చరిత్రలో తన డెబ్యూ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన అతికొద్ది మంది బౌలర్ల క్లబ్‌లో ప్రఫుల్ చేరిపోయాడు. ముఖ్యంగా ఈ టోర్నీలో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన వైభ‌వ్ ను గోల్డెన్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు పంప‌డం మ్యాచ్ కే హైలెట్. ఆ త‌ర్వాత జురేల్ ను క్లీన్ బౌల్డ్ చేయ‌డం కూడా ఆరెంజ్ ఆర్మీని మైమ‌రింప జేసింది.

కష్టాల నుండి స్టార్‌డమ్ వరకు..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో 2002లో జన్మించిన ప్రఫుల్ హింగే నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట అతను క్రికెట్ లో బ్యాటర్‌గా రాణించాలని అనుకున్నాడు. అయితే, తన తండ్రి ఇచ్చిన సలహాతో బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాడు. చెన్నైలోని ప్రఖ్యాత ఎంఆర్ఎఫ్ (MRF) పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొంది తన వేగాన్ని, ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో విదర్భ తరపున ఆడుతూ సెలెక్టర్ల కళ్లలో పడ్డాడు. 2024 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

వాల్యూ ఫర్ మనీ పర్ఫార్మెన్స్..

గతేడాది జరిగిన వేలంలో సన్ రైజర్స్ టీమ్ ప్రఫుల్‌ను కేవలం రూ. 30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఇప్పుడు ఆ పెట్టుబడికి వంద రెట్ల ఫలితం లభించినట్లు కనిపిస్తోంది. కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్లు హ‌ర్ష‌ల్ ప‌టేల్, జైదేవ్ ఉనాద్క‌ట్ , ఇషాన్ మ‌లింగా  విఫలమవుతున్న చోట, ఈ యువ పేసర్ టీమ్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. తన సోదరి చేసిన త్యాగాలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఇక్కడి వరకు వచ్చానని ప్రఫుల్ భావోద్వేగంతో గ‌తంలో చెప్పాడు. మైదానంలో పరుగు తీస్తున్నప్పుడు అతని వేగం చూస్తుంటే భారత జట్టుకు మరో క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 'విదర్భ ఎక్స్‌ప్రెస్' వేగానికి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అవుతారో చూడాలి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రఫుల్ పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప‌వ‌ర్ ప్లేలోనే నాలుగు కీల‌క వికెట్ల‌ను తీసి స‌త్తా చాటాడు. 

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget