వాంఖడేలో రికార్డుల మోత.. 11 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన ఆర్సీబీ, ముంబై
MI vs RCB Score IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. ఛేజింగ్‌లో ముంబై పోరాడటంతో వాంఖడే స్టేడియంలో ఓ మ్యాచులో అత్యధిక స్కోరు నమోదైంది. సాధించారు.

Highest Team Total at Wankhede Stadium in IPL | వాంఖడే స్టేడియంలో పలు రికార్డులు నమోదయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్‌కు దిగి 240 పరుగులు చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో IPLలో అత్యధిక స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లీ 50 పరుగులు చేయగా, ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో 65వ అర్ధ శతకం.
ఈ మ్యాచులో ఛేజింగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. దాంతో వాంఖండే స్టేడియంలో ఓ మ్యాచులో అత్యధిక స్కోరు (462) నమోదైంది. మరోవైపు ముంబై జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ లో 4 జట్లపై కోహ్లీ వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
తన రికార్డును తానే బద్దలు కొట్టిన RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో 240 పరుగులు చేసింది. IPLలో వాంఖడే స్టేడియంలో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇది. బెంగళూరు తన పాత రికార్డును తానే అధిగమించింది. 2015లో బెంగళూరు ఇదే స్టేడియంలో 235 పరుగుల స్కోరును నమోదు చేసింది. 11 ఏళ్ల పాటు వాంఖడే మైదానంలో IPL లో ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. ఇప్పుడు RCB ఆ రికార్డును మెరుగు చేసుకుంది. ఈ జాబితాలో 234 పరుగులతో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది.
2️⃣0️⃣2️⃣6️⃣ is the new 2̶0̶1̶6̶ 2️⃣0️⃣1️⃣5️⃣. 😉❤️🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 12, 2026
Two of the highest scores EVER at Wankhede in the IPL, courtesy RCB. 🚀#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #MIvRCB pic.twitter.com/xSIXRWPUcS
వాంఖడేలో అత్యధిక స్కోర్లు:
- 240 పరుగులు - RCB (ముంబైపై) - 2026
- 235 పరుగులు - RCB (ముంబైపై) - 2015
- 234 పరుగులు - MI (ఢిల్లీపై) - 2024
- 230 పరుగులు - PBKS (ముంబైపై) - 2017
తేలిపోయిన ముంబై బౌలర్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే 71 పరుగులు చేశారు. కోహ్లీ, సాల్ట్ మధ్య 120 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొంది. సాల్ట్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకంగా మారాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ రాకతోనే విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి RCB తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 34 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి బెంగళూరును 240 పరుగుల చారిత్రాత్మక స్కోరుకు చేర్చాడు.
IPLలో RCB, MI మధ్య నమోదైన అత్యధిక మ్యాచ్ పరుగులు (462) ఇవే. వాంఖడే స్టేడియంలో నమోదైన మూడు ఐపీఎల్ (IPL) అత్యధిక స్కోర్లు ఇలా ఉన్నాయి:
- 240/3 – ఆర్సీబీ (RCB): 2026లో ముంబై ఇండియన్స్‌పై ఈ భారీ స్కోరు సాధించి తన పాత రికార్డును తానే బద్దలు కొట్టింది.
- 235/1 – ఆర్సీబీ (RCB): 2015లో ముంబై ఇండియన్స్‌పైనే ఈ స్కోరు నమోదైంది. ఇది సుమారు 11 ఏళ్ల పాటు అత్యధిక స్కోరుగా కొనసాగింది.
- 234/5 – ముంబై ఇండియన్స్ (MI): 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఈ స్కోరును సాధించింది.
ట్రెండింగ్ వార్తలు


















