అన్వేషించండి

Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?

Vaibhav Sooryavanshi Face 10 Challenges In IPL 2026: వైభవ్ సూర్యవంశికి కేవలం 15 ఏళ్లు మాత్రమే. కానీ దిగ్గజాలు సాధించలేదని రికార్డులు అవలీలగా తన పేరిట లిఖించుకుంటున్న వైభవ్ ముందు 10 సవాళ్లు ఇవే.

Vaibhav Sooryavanshi Face Challenges In IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL) ఉత్కంఠభరితంగా సాగుతోంది. సీజన్లో మూడో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ముందు 10 కొత్త సవాళ్లు ఉన్నాయి. వాటిలో వైభవ్ ఎన్నింటిని అధిగమిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల వయసున్న సూర్యవంశీ ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన మ్యాచ్‌తో రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో వైభవ్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించాడు. మరి ఈ సీజన్‌లో వైభవ్ ముందున్న ఆ 10 సవాళ్లు ఏమిటి ఇక్కడ తెలుసుకోండి.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ముందున్న 10 సవాళ్లు ఇవే..

  1. వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ రాజస్థాన్ రాయల్స్ 18 ఏళ్ల టైటిల్ కరువును తీర్చడం. జట్టుకు ట్రోఫీ అందించడమే తన లక్ష్యమని ఐపీఎల్ 2026కి ముందే వైభవ్ తెలిపాడు. అయితే తన ఆటతో పాటు మిగిలిన ఆటగాళ్ల ప్రదర్శనతోనే ఇది సాధ్యపడుతుంది. 

  2. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్ 2026లో ఈ రికార్డును బద్దలు కొట్టడం వైభవ్ ముందున్న రెండో ఛాలెంజ్. బీసీసీఐ నమన్ అవార్డుల సమయంలోనే ఈ బ్యాటర్ తన మనసులోని ఈ కోరికను బయటపెట్టాడు.

  3. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తన పేరిట లిఖించుకోవడం వైభవ్ ముందున్న మూడో సవాలు.

  4. ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం వైభవ్ ముందున్న నాలుగో ఛాలెంజ్. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఎవరూ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టలేదు. వైభవ్ కూడా తన కెరీర్‌లో ఈ ఘనత సాధించలేదు.

  5. 2025 ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ, 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో 252 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ సాధించాలనేది అతని ఐదో టార్గెట్. 

 

  1. తన అరంగేట్రం సీజన్‌లోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్ (35 బంతుల్లో) వైభవ్ రికార్డు సృష్టించాడు. కానీ 30 బంతుల్లోనే సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాలని ఆశ పడుతున్నాడు. 

  2. అతి చిన్న వయసులో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం వైభవ్‌ సూర్యవంశీ ముందున్న ఏడో సవాలు. ప్రస్తుతం ఈ రికార్డు పృథ్వీ షా (598 పరుగులు) పేరిట ఉంది. మరో 347 పరుగులు చేస్తే ఈ రికార్డు బద్దలవుతుంది.

  3. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సెంచరీలు బాదడం వైభవ్ సూర్యవంశీ ముందున్న ఎనిమిదో సవాలు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ ఒకే సీజన్లో చెరో 4 సెంచరీలతో ఈ రికార్డును పంచుకుంటున్నారు.

  4. ఒక సీజన్‌లో అత్యధికంగా 59 సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఈ రికార్డు సాధించినప్పుడు వైభవ్ వయసు కేవలం 1 ఏడాది. ఇప్పుడు 15 ఏళ్ల వయసులో ఆ రికార్డును అధిగమించాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. 

  5. ఒకే సీజన్‌లో అత్యధికంగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలవాలని జట్లుకు సాధ్యమైనన్ని విజయాలు అందించడం వైభవ్ ముందున్న పదో సవాలు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలంటే, వైభవ్ లాంటి బ్యాటర్ సీజన్లో అద్భుతాలు చేయక తప్పదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget