అన్వేషించండి

RCB Sale Updates: ఆర్సీబీ అమ్మ‌కం వార్తల‌పై బీఎస్సీ స్టాక్ ఎక్స్ చేంజీ ఆరా.. లేఖ ద్వారా స్ప‌ష్ట‌తనిచ్చిన ఆర్సీబీ యాజ‌మాన్యం

ఆర్సీబీ అమ్మ‌కాల వార్తల నేప‌థ్యంలో యాజ‌మాన్య కంపెనీ షేరు మూడు శాతం పెరిగింది. 18 ఏళ్ల త‌ర్వాత తొలి టైటిల్ సాధించ‌డంతో ఫ్రాంచైజీలో వాటాను అమ్ముతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 

RCB IPL 2025 Champions: త‌మ ఫ్రాంచైజీని అమ్మేస్తురంటూ వ‌స్తున్న ఊహాగానాల‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మేనేజ్మెంట్ స్పందించింది. తాజాగా బీఎస్సీ స్టాక్ ఎక్స‌చేంజీకి రాసిన లేఖ‌లో దీనిపై స్ప‌ష్ట‌త నిచ్చింది. నిజానికి ఇటీవ‌ల ఆర్సీబీ ఫ్రాంచైజీ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈనెల 3న తొలి టైటిల్ గెలిచి, 18 ఏళ్ల క‌ల‌ను సాక‌రం చేసుకున్న ఈ జ‌ట్టుకు ఆ త‌ర్వాత రోజే షాక్ ఎదురైంది.

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ప‌రిస‌రాల‌లో జ‌రిగిన తొక్కిస‌లాటలో 11 మంది మ‌రణించ‌గా, ప‌దుల సంఖ్య‌లో అభిమానులు గాయప‌డ్డారు. అలాగే ఈ దుర్ఘ‌ట‌న‌పై క‌న్నెర్ర చేసిన కర్ణాట‌క ప్ర‌భుత్వం ఫ్రాంచైజీ అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏపై కూడా కేసులు న‌మోదు చేసి ప‌లు అరెస్టులు చేసింది. ఈ నేప‌థ్య‌లో ఫ్రాంచైజీలో వాటాను అమ్మ‌డానికి మేనేజ్మెంట్ సిద్ధ‌మైందనే వార్తలు హ‌ల్చ‌ల్ చేశాయి. ఇన్నాళ్లు అంద‌ని ద్రాక్ష‌లా ఉన్న టైటిల్ ద‌క్క‌డంతోపాటు వివాదాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. తాజాగా ఆర్సీబీ మేనేజ్మెంట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది.

బీఎస్సీకి లేఖ‌..
ఇక ఆర్సీబీ అమ్మ‌కం వార్త‌ల‌తో ఆర్సీబీ యాజ‌మాన్యానికి చెంద‌ని కంపెనీల షేరు మూడు శాతం ఎగ‌బాకింది. దీంతో రంగంలోకి దిగిన బీఎస్సీ స్టాక్ ఎక్స్ చేంజీ అమ్మ‌కానిపై వివ‌ర‌ణ కోరింది. దీనికి జ‌వాబిచ్చిన యాజ‌మాన్యం.. త‌మ‌కు ఇప్ప‌ట్లో ఆర్సీబీని అమ్మే ఉద్దేశం లేద‌ని, ఇవ‌న్నీ పుకార్లేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఐపీఎల్‌ను ప్రారంభ ఎనిమిది జట్లలో ఆర్‌సీబీ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్సీబీ యాజమాని అయిన యునైటెడ్ స్పిరిట్స్‌ను విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ స్పిరిట్స్‌ను బ్రిటిష్‌కు చెందిన డియాజియో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్‌సీబీ యాజమాన్యం డియాజియోకు వెళ్లింది. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ ఈ ఏడాది తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే అంతలోనే అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇక  బెంగ‌ళూరు తొక్కిస‌లాటాపై ఐపీఎల్ మాజీ క‌మిష‌న‌ర్ ల‌లిత్ మోదీ విచారం వ్య‌క్తం చేశాడు. అలాంటి దుర్ఘ‌ట‌న జ‌రిగి ఉండకుండా చ‌ర్యలు తీసుకునే ఉంటే బాగుండేన‌ని వ్యాఖ్యానించాడు. 

వ్య‌వ‌స్థ‌ల వైఫ‌ల్యం..
బెంగ‌ళూరు తొక్కిస‌లాటలో అన్ని రంగాల వైఫల్యం  క‌నిపిస్తోంద‌ని మోదీ వ్యాఖ్యానించాడు. ప్ర‌భుత్వ అధికారుల‌తోపాటు టీమ్ మేనేజ్మెంట్ స‌రిగ్గా ఏర్పాట్లు చేయ‌కుండానే ఇంత భారీ ప్రొగ్రామ్ ఏర్పాటు చేయ‌డం స‌రికాద‌ని తెలిపాడు. ఇలాంటివి అవాయిడ్ చేస్తే బాగుండేన‌ని పేర్కొన్నాడు. నిజానికి ఉత్స‌వ వేడుక‌ల‌ను ఆదివారానికి షిఫ్ట్ చేయాల‌ని పోలీసులు సూచించినా, విదేశీ ప్లేయ‌ర్లు అందుబాటులో ఉండ‌రంటూ హ‌డావిడిగా ఫ్రాంచైజీ యాజ‌మాన్యం ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.     

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget