IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో అత్యధిక మొత్తం రైజర్స్ దగ్గరే - వ్యూహం ఏం అయి ఉంటుంది?
ఐపీఎల్ మినీవేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్ మొత్తం, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే.
IPL Auction 2023, Sunrisers Hyderabad: ఐపీఎల్ వేలం 2023 శుక్రవారం జరగనుంది. అయితే ఇది కొచ్చిలో జరగబోయే మినీ వేలం. వాస్తవానికి మెగా వేలం గత సంవత్సరమే జరిగింది. ఇప్పుడు జరగబోయే వేలానికి ముందు అన్ని జట్లు తమ సంబంధిత నిలుపుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక పర్స్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.42.25 కోట్లు వేలంలో స్పెండ్ చేయవచ్చు.
సన్‌రైజర్స్ పర్స్‌లో ఎంత ఉంది - రూ.42.25 కోట్లు
మొత్తం అందుబాటులో ఉన్న స్లాట్లు - 13
విదేశీ ఆటగాళ్ల స్లాట్లు - 4
వికెట్ కీపర్ - గ్లెన్ ఫిలిప్ (న్యూజిలాండ్)
బ్యాట్స్‌మెన్ - అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా), రాహుల్ త్రిపాఠి
ఆల్‌రౌండర్లు - అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్
బౌలర్లు - ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా), కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
ఐపీఎల్ 2023 వేలం డిసెంబర్ 23వ తేదీన జరగనుంది. అభిమానులు ఈ ఐపీఎల్ వేలంపాటను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది కాకుండా జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. ఈ వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్ళు కాకుండా, స్థానిక భారతీయ ప్రతిభ కూడా ఉంది. బెన్ స్టోక్స్, శామ్ కరన్ వంటి ఆటగాళ్ళపై డబ్బు వర్షం కురుస్తుందని అంచనా. చాలా మంది ఆటగాళ్ల ధర ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. ఈ వేలం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇది ఏడు గంటల పాటు జరగనుంది. మధ్యలో సుమారు ఒక గంట విరామం ఉంటుంది.
View this post on Instagram
View this post on Instagram