IPL 2025 Final: తొలి ట్రోఫీ నెగ్గాలంటే పంజాబ్ కింగ్స్ ఈ 3 సవాళ్లను అధిగమించాలి, లేదంలే ఈసాలా కప్ నమదే
RCB vs PBKS Final| పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఆర్‌సీబీని ఎదుర్కొనేందుకు 3 పెద్ద సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ లోపాలను సరిచేయకపోతే ఆర్‌సీబీ తొలిసారిగా టైటిల్ గెలుస్తుంది.

IPL 2025 RCB vs PBKS Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ని ఓడించి ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. కానీ తమ తొలి టైటిల్ పోరుకు ముందు పంజాక్ ఎదుట కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ కు మూడు బలహీనతలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తే కప్ నెగ్గే అవకాశం ఉంది. లేకపోతే RCB జట్టు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడవచ్చు. కానీ ఎవరు గెలిచిన ఐపీఎల్ చరిత్రలో మరో కొత్త ఛాంపియన్ కానుంది. పంజాబ్‌ను కలవరపెట్టే ఆ మూడు విషయాలు ఏమిటో తెలుసుకుందాం. .
బలహీనంగా స్పిన్ బౌలింగ్
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు ఆశించినంత ప్రభావాన్ని చూపలేదు. క్వాలిఫయర్-2 లో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తిరిగి జట్టులోకి వచ్చాడు, కానీ అతని అనుభవం అంత ప్రభావం చూపలేదు. ముంబై ఇండియన్స్ తోనూ వికెట్లు తీయడంలో చాహల్ చాలా ఇబ్బంది పడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే మోదీ స్టేడియంలో పంజాబ్ స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. ఫైనల్ జరిగే పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. కనుక స్పిన్నర్లు రాణిస్తే పంజాబ్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయనుంది. పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీయడంలో స్పిన్నర్లు సక్సెస్ కావాలి. లేకపోతే RCB బలమైన బ్యాటింగ్ పంజాబ్ పై భారీ స్కోర్ చేయడం ఖాయం.
📍 Narendra Modi Stadium, Ahmedabad
— IndianPremierLeague (@IPL) June 2, 2025
📸 The 2⃣ captains gear up for Final Face-off ❤️
𝗔𝗥𝗘. 𝗬𝗢𝗨. 𝗥𝗘𝗔𝗗𝗬? ⏳ #TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/WG0cS0iTVv
ఓపెనింగ్ పెయిర్ విఫలం
ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య జంట గత రెండు నాకౌట్ మ్యాచ్ లలో విఫలమయ్యారు. లీగ్ లో కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్లు రాణించగా, కొన్ని మ్యాచ్ లలో ఎవరో ఒక ఓపెనర్ మెరుపు వేగంతో పరుగులు రాబట్టారు. ముఖ్యంగా మొదటి క్వాలిఫైర్ లో ఓపెనర్లు విఫలం కావడమే పంజాబ్ ఓటమికి ప్రధాన కారణం. ఫైనల్ లాంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లో ఏ జట్టుకైనా మంచి ప్రారంభం చాలా ముఖ్యం. ఈసారి కూడా టాపార్డర్ త్వరగా ఔటైతే, జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాలు తగ్గుతాయి. .
కెప్టెన్ పై ఆధారపడిన టీం
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ క్వాలిఫయర్-2 లో ముంబై ఇండియన్స్ మీద విజయాన్ని అందించి జట్టును ఫైనల్ కు చేర్చింది. జట్టు బ్యాటింగ్ పూర్తిగా కెప్టెన్ అయ్యర్ పై ఆధారపడుతోంది. ఫైనల్ లో అయ్యర్ త్వరగా ఔట్ అయితే, జట్టు బ్యాటింగ్ బారాన్ని మోసెదెవరు అని అనుమానాలున్నాయి. అందుకే మిగతా బ్యాటర్లు సైతం పరుగులు స్కోర్ చేయాలి. దాంతో కెప్టెన్ పై ఒత్తిడి తగ్గుతుంది.
గేమ్ ఛేంజర్
RCB విషయానికి వస్తే వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జోష్ హేజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవం ఉన్న అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. వీరిని సమర్థంగా ఎదుర్కోవడం, నియంత్రించడం చేస్తేనే పంజాబ్ ఆశలు చిగురిస్తాయి. పంజాబ్ తమ బలహీనతల్ని అధిగమించకపోతే తొలి ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ ఎగరేసుకుపోవడం ఖాయం.
క్వాలిఫయర్ 2లో వర్షం వల్ల రెండు గంటలు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ మోదీ స్టేడియంలోనే జరగనుంది. నేటి సాయంత్రం 6 గంటలకు వర్షం పడే అవకాశం 51 శాతం ఉండగా.. మ్యాచ్ సమయానికి వర్షం నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఓవర్లు కుదించినా రిజర్వ్ డే అవసరం లేకుండానే మ్యాచ్ కచ్చితంగా నేడు పూర్తవుతుంది.





















