IPL Winners List: ఐపీఎల్‌లో 2008 నుంచి ఏ సీజన్లో ఏ జట్టు ఛాంపియన్? రన్నరప్ ఎవరు?
List of IPL winners: పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్‌లో తలపడనున్నాయి. కొత్త విజేతను ఈసారి ఐపీఎల్‌లో చూడబోతున్నాం.

List of IPL winners from 2008 to 2024: ఈసారి మనకు కొత్త IPL ఛాంపియన్ జట్టు దొరుకుతుందని ఖాయం, ఎందుకంటే 2008 నుంచి ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఏ IPL టైటిల్‌ను గెలవలేదు. రెండు జట్లు మంగళవారం, జూన్ 3న నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్‌లో తలపడతాయి. ఇక్కడ 2008 నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్ అయింది, ఎవరు రన్నరప్ అయ్యారో, దాని గురించి సమాచారం ఇక్కడ తెలుసుకోండి .
IPLలో అత్యధిక ట్రోఫీలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న జట్లు. రెండూ టీంలు కూడా ఐదేసి సార్లు ట్రోఫీలు గెలుచుకున్నాయి, కానీ IPL 2025 ఫైనల్‌లో లేవు. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్ పోటీ నుంచి బయటకు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించింద. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. కానీ క్వాలిఫైయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.
IPL విజేతల జాబితా (2008 నుంచి 2024 వరకు)
- IPL 2008 విజేత: రాజస్థాన్ రాయల్స్
- IPL 2009 విజేత: డెక్కన్ ఛార్జర్స్
- IPL 2010 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
- IPL 2011 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
- IPL 2012 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
- IPL 2013 విజేత: ముంబై ఇండియన్స్
- IPL 2014 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
- IPL 2015 విజేత: ముంబై ఇండియన్స్
- IPL 2016 విజేత: సన్‌రైజర్స్ హైదరాబాద్
- IPL 2017 విజేత: ముంబై ఇండియన్స్
- IPL 2018 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
- IPL 2019 విజేత: ముంబై ఇండియన్స్
- IPL 2020 విజేత: ముంబై ఇండియన్స్
- IPL 2021 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
- IPL 2022 విజేత: గుజరాత్ టైటాన్స్
- IPL 2023 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
- IPL 2024 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
IPLలో ప్రతి సీజన్ రన్నరప్
- 2008: చెన్నై సూపర్ కింగ్స్
- 2009: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2010: ముంబై ఇండియన్స్
- 2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2012: చెన్నై సూపర్ కింగ్స్
- 2013: చెన్నై సూపర్ కింగ్స్
- 2014: పంజాబ్ కింగ్స్
- 2015: చెన్నై సూపర్ కింగ్స్
- 2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2017: రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్
- 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్
- 2019: చెన్నై సూపర్ కింగ్స్
- 2020: ఢిల్లీ క్యాపిటల్స్
- 2021: కోల్‌కతా నైట్ రైడర్స్
- 2022: రాజస్థాన్ రాయల్స్
- 2023: గుజరాత్ టైటాన్స్
- 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్
IPLలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
IPLలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ గెలుచుకున్న రికార్డు సునీల్ నారాయణ్ పేరిట ఉంది. ఆయన మొత్తం 3 సార్లు (2012, 2018 ,2014) ఈ అవార్డును గెలుచుకున్నారు.
అత్యధిక IPL ఫైనల్స్ ఆడిన జట్టు
చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక IPL ఫైనల్స్ ఆడిన జట్టు. ఆ జట్టు మొత్తం 10 ఫైనల్స్ ఆడింది. వాటిలో 5 గెలిచింది. ముంబై ఇండియన్స్ 6 సార్లు IPL ఫైనల్స్‌కు చేరుకుంది, అందులో ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్నిసార్లు IPL ఫైనల్స్‌కు చేరుకుంది?
IPL 2025కి ముందు RCB మొత్తం 3 సార్లు IPL ఫైనల్స్‌కు చేరుకుంది, కానీ ఎప్పుడూ ట్రోఫీ గెలవలేదు. RCB 2009, 2011, 2016లో ఫైనల్స్‌కు చేరుకుంది.
పంజాబ్ కింగ్స్ ఎన్నిసార్లు IPL ఫైనల్స్‌కు చేరుకుంది?
IPL 2025కి ముందు పంజాబ్ ఒక్కసారి మాత్రమే IPL ఫైనల్స్‌కు చేరుకుంది. 2014లో ఫైనల్స్‌లో ఆ జట్టును KKR ఓడించింది. అప్పటి నుంచి ఇప్పుడు ఈ జట్టు ఫైనల్ ఆడుతున్నది ఇదే మొదటిసారి.




















