అన్వేషించండి

IPL 2024 : మార్చి 22 నుంచి ఐపీఎల్‌! , రంగం సిద్ధం చేస్తున్న బీసీసీఐ

IPL 2024 : దేశంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.ఈ సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

దేశంలో ఐపీఎల్‌(IPL) సందడి మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 22 నుంచి IPL  ప్రారంభం కానుందని సోషల్ మీడియాతోపాటు జాతీయ మీడియా సంస్థల్లో కోడై కూస్తున్నాయి. సూమారు రెండు నెలలపాటు సాగనున్న ఈ టోర్నీ మే నెల చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత ఐపీఎల్‌-2024 సీజన్‌ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. 


నేడే దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌ వేలం జరగనుంది. ఈ సారి వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 77 ఖాళీలే ఉండగా 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఐపీఎల్‌ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం  ఈ జాబితాను పది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఈసారి వేలంలో స్టార్‌ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఈ ఆసీస్‌ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు.  న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. ఎట్టకేలకు గత సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ తరహా లీగ్‌లు జరుగుతాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది.

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget