IPL 2023: ముంబై ఎలాగైనా ఓడిపోవాలి - ఇదే కోరుకుంటున్న ఏడు ఫ్రాంచైజీలు - ఎందుకంటే?
ఐపీఎల్‌లో నేడు గుజరాత్, ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని మిగతా అన్ని జట్ల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
![IPL 2023: ముంబై ఎలాగైనా ఓడిపోవాలి - ఇదే కోరుకుంటున్న ఏడు ఫ్రాంచైజీలు - ఎందుకంటే? IPL 2023: MI Vs GT RR LSG RCB KKR PBKS SRH DC Will Pray For Gujarat TiTans Victory Know Play Offs Race IPL 2023: ముంబై ఎలాగైనా ఓడిపోవాలి - ఇదే కోరుకుంటున్న ఏడు ఫ్రాంచైజీలు - ఎందుకంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/434ddeb78fbd907a31d13e759ea8359d1683855923656366_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2023, Playoffs Race: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 57వ మ్యాచ్ ఈరోజు (మే 12వ తేదీ) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా గుజరాత్ జట్టు ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు అతిథులను ఓడించడం ద్వారా టాప్ 4లో చోటును పదిలం చేసుకోవాలని అనుకుంటుంది.
ఐపీఎల్ 2023లో ముంబై ఓడిపోవాలని మిగతా జట్లు ప్రార్థించే మ్యాచ్ ఇది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే, చాలా జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారతాయి. అదే గుజరాత్ గెలిస్తే కొన్ని జట్లకు టాప్ 4లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మొత్తమ్మీద ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ రేసు చాలా ఉత్కంఠభరితంగా మారింది.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు హార్దిక్ పాండ్యా జట్టు గెలవాలని ప్రార్థించనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిస్తే మిగతా జట్లు ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టు గెలిస్తే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్లేఆఫ్ మార్గం కష్టమవుతుంది.
నంబర్ వన్‌గా గుజరాత్
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే హార్దిక్ జట్టుకు ఒక్క విజయం మాత్రమే కావాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో గుజరాత్ 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 3 ఓడిపోయింది. ముంబై జట్టు 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 5 ఓడింది. ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో ముంబై జట్టు మ్యాచ్ ఓడిపోతే ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టం అవుతాయి.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే ఆర్‌సీబీ, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కాస్త ఉపశమనం లభించనుంది. కోల్‌కతాను పక్కన పెడితే మిగిలిన జట్లు 16 పాయింట్లు సాధించవచ్చు. KKR 14 పాయింట్లను స్కోర్ చేయగల జట్టు. అందుకే ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టమే. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 14 పాయింట్లతో తమ ప్రస్థానాన్ని ముగించవచ్చు. ఇది కాకుండా 16 పాయింట్లు ఉన్న జట్లలో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు టాప్ 4కు చేరుకుంటాయి.
𝗕𝗔𝗟𝗟𝗘𝗥𝗦: 𝕊𝕂𝕐 🤝 ℝ𝔸𝕐#OneFamily #MIvGT #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @surya_14kumar @NBA @NBAIndia @celtics pic.twitter.com/Fhvh90q0h5
— Mumbai Indians (@mipaltan) May 12, 2023
𝙃𝙪𝙨𝙩𝙡𝙚 𝙩𝙤 𝙜𝙚𝙩 𝙗𝙚𝙩𝙩𝙚𝙧 ft. Dewald Brevis 🏏#OneFamily #MIvGT #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 @BrevisDewald MI TV pic.twitter.com/5avdmVuKVI
— Mumbai Indians (@mipaltan) May 12, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)