IPL 2022: ఐపీఎల్ జట్టు మెంటార్‌గా గౌతమ్ గంభీర్.. ఏ జట్టుకంటే?
ఆండీ ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసుకుంటున్నామని లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా శుక్రవారం ప్రకటించారు. ఇదే స్పీడులో ఆ జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా ఎంపిక చేసుకుందని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూ తెరవెనుక పనులను చకచకా చక్కబెట్టేస్తోంది. ఇప్పటికే ఆండీ ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకున్న ఆ జట్టు తాజాగా గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా ఎంపిక చేసుకుందని తెలిసింది. కేఎల్ రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడన్న ఊహాగానాలు ఎప్పట్నుంచో ఉన్నాయి.
ఐపీఎల్ 2022కు సంబంధించిన రీటెన్షన్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉన్న జట్లన్నీ కనీసం ముగ్గురిని అట్టిపెట్టుకున్నాయి. ఇక మిగిలిన వారిలోంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు కొత్త జట్లు తమ ఎంపికలు పూర్తయ్యే వరకు ఆటగాళ్లను అధికారికంగా ప్రకటించేందుకు వీల్లేదు. కాగా గోయెంకా గ్రూప్‌నకు చెందిన లఖ్‌నవూ ఫ్రాంచైజీ అన్ని పనులను చకచకా పూర్తి చేసేసుకుంటోంది.
పంజాబ్ కింగ్స్‌కు సహాయ కోచ్‌గా పనిచేసిన ఆండీ ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసుకుంటున్నామని లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా శుక్రవారం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కే వీరు సారథ్యం అప్పగిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే చాలా ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. ఇదే స్పీడులో ఆ జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా ఎంపిక చేసుకుందని సమాచారం.
'ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ తనను తాను నిరూపించుకున్నాడు. పైగా యువ ప్రతిభావంతులను అతడి తీర్చిదిద్దుతున్నాడు. కొత్త టాలెంట్‌ను గుర్తిస్తున్నాడు. దాంతో తీవ్ర పోటీ పరిస్థితులున్న ఐపీఎల్‌లో జట్టును ముందుకు నడిపించేందుకు అతడి అనుభవం సరిపోతుందని లఖ్‌నవూ భావించింది' అని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!
Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్ భారత్..! పాక్‌ను ఓడించి సెమీస్ చేరిన హాకీ ఇండియా
Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి