By: ABP Desam | Updated at : 17 Dec 2021 05:26 PM (IST)
Edited By: Ramakrishna Paladi
హాకీ ఇండియా
టీమ్‌ఇండియా అద్భుతం చేసింది! దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆసియా ఛాంపియన్‌షిప్ హాకీ మ్యాచులో చిరకాల శత్రువును 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. సెమీ ఫైనల్‌కు చేరుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు, ఆకాశ్‌దీప్ సింగ్ ఒక గోల్ చేశారు.
తొలి క్వార్టర్ ఆరంభంలోనే టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. గ్రీన్‌కార్డు చూపించడంతో ఆకాశ్‌దీప్ సింగ్ రెండు నిమిషాల పాటు బయటే ఉన్నాడు. భారత్ పది మందితోనే ఆట మొదలు పెట్టినా బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంది. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. పాక్ వైపు ఒకరు తక్కువ ఉన్నవేళ హర్మన్‌ప్రీత్ సింగ్ సునాయాసంగా బంతిని నెట్స్‌లోకి పంపించేశాడు. దాంతో 1-0తో భారత్ క్వార్టర్‌ను ముగించింది.
A phenomenal all-round performance earns India the BIG 𝐖 over Pakistan 💙#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/uxwWQ7Pm9A
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
రెండో క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నించాయి. కానీ డిఫెన్స్‌తో ఒకరి అవకాశాలను మరొకటి అడ్డుకున్నాయి. మూడో క్వార్టర్ ఆఖర్లో భారత్‌కు మరో గోల్ లభించింది. 42వ నిమిషంలో లక్రా పాస్ చేసిన బంతిని ఆకాశ్‌దీప్ ఒడుపుగా నెట్స్‌లోకి పంపించి స్కోరును 2-0కు పెంచాడు. కానీ మరో మూడు నిమిషాల్లోనే జునైద్ మంజూర్ గోల్ కొట్టి భారత స్కోరును 1-2 తగ్గించాడు. ఆఖరి క్వార్టర్లో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్లను టీమ్‌ఇండియా సమర్థంగా అడ్డుకొంది. అంతేకాకుండా 53వ నిమిషంలో లభించిన పీసీని డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్ నెట్స్‌లోకి పంపించి 3-1తో జట్టును తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. ఘన విజయం అందించాడు.
54' Penalty Corner number 2⃣ for India and Harmanpreet Singh converts with absolute finesse 😍
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
India double the lead 🙌
🇮🇳 3:1 🇵🇰#IndiaKaGame #HeroACT2021 pic.twitter.com/kB4ngyGDbz
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: David Warner: మనసులు గెలిచిన వార్నర్.. ఏం చేశాడంటే?
Also Read: Ganguly on Virat Kohli: 'బోత్ ఆర్ నాట్ సేమ్..!' గంగూలీ వద్ద కోహ్లీ తప్పని నిరూపించే సాక్ష్యాలు?
Also Read: Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే