X

IPL 2022 Auction: కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను కలవడం అన్యాయం.. SRH, PBKS ఫిర్యాదు!

పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి. రాహుల్‌, రషీద్‌ను లఖ్‌నవూ దురుద్దేశంగా కలిసిందని ఆరోపించాయి. చర్యలు తీసుకొనేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

FOLLOW US: 

కొత్తగా వచ్చిన లఖ్‌నవూ ఫ్రాంచైజీపై పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను కావాలనే లాగేసినట్టు ఆరోపించాయి. ఉద్దేశపూర్వకంగా తమ జట్టు కూర్పును దెబ్బతీసిందని వెల్లడించాయి. బీసీసీఐ సైతం సానుకూలంగానే స్పందించిందని సమాచారం.

ఐపీఎల్‌ రాబోయే సీజన్ల కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకొనేందుకు నేడే చివరి తేదీ. నేటి సాయంత్రం లోపు ఎవరెవరిని తీసుకుంటున్నారో ఆ జాబితాలను బీసీసీఐ సమర్పించాలి. ఇప్పటికే జట్లన్నీ జాబితాలను సిద్ధం చేశాయి. కాగా పంజాబ్‌ కింగ్స్‌ నుంచి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, హైదరాబాద్‌ నుంచి రషీద్‌ ఖాన్‌ విడిపోతున్నట్టు తెలిసిందే. దురుద్దేశ పూర్వకంగా ఆటగాళ్లని కలిసి తమతో బంధం తెంచుకొనేలా చేసిందని లఖ్‌నవూపై ఆ రెండు జట్లు ఆరోపిస్తున్నాయి.

'అధికారికంగా మాకెలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. కానీ రెండు ఫ్రాంచైజీల నుంచి మౌఖికంగా ఫిర్యాదులు అందాయి. వారి ఆటగాళ్లను దురుద్దేశపూర్వకంగా లఖ్‌నవూ ఫ్రాంచైజీ కలిసిందని ఆరోపించాయి. ఈ విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం. ఇది నిజమని తేలితే మేం సరైన చర్యలు తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఐపీఎల్‌లో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని బీసీసీఐ అధికారి అంటున్నారు. ఆటగాళ్లను కలవకుండా అడ్డుకోవడం కష్టమని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న జట్ల కూర్పు, సమతూకం దెబ్బతీయడం మాత్రం న్యాయం కాదని స్పష్టం చేస్తున్నారు. 'సమతూకం దెబ్బతీయాలని మేం కోరుకోవడం లేదు. తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. జట్ల కూర్పు దెబ్బతీయడం సరికాదు' అని ఆ అధికారి వెల్లడించారు.

Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్‌

Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!

Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!

Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?

Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. SRH ఒక్కరికే ఛాన్స్ ఇచ్చిందా..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: IPL KL Rahul complaint Rashid Khan SRH lucknow PBKS IPL 2022 Auction

సంబంధిత కథనాలు

Harbhajan Favorite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?

Harbhajan Favorite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?

Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!

Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి