IPL 2022 Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. SRH ఒక్కరికే ఛాన్స్ ఇచ్చిందా..!
IPL 2022 Retained Players List: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లతో పాటు మరికొందరు కీలక ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాయి.
IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)కు సంబంధించి రీటెన్షన్ నవంబర్ 30లోపు పూర్తి చేయాలి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము తమ వద్ద అట్టిపెట్టుకున్న (రీటెయిన్) చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆటగాళ్ల వేలం ప్రక్రియ.. జట్టుకు ఎంతమేర నగదు ఉంటుందన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లతో పాటు మరికొందరు కీలక ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాయి. నేడు అధికారికంగా రీటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టి పరిస్థితుల్లోనూ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మెగా వేలానికి పంపదు. విరాట్ కోహ్లీ విషయంలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది ఇదే ధోరణి. అండర్ 19 క్రికెటర్ అయిన కోహ్లీని 2008లో వేలంలో తీసుకున్నప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోసారి ఆర్సీబీ కోహ్లీని రీటెయిన్ చేసుకుంటుంది. ఐదు పర్యాయాలు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ ఛాంపియన్ ముంబై వదులుకోదని తెలిసిందే. అతడితో పాటు జస్ప్రిత్ బూమ్రాను ముంబై రీటెయిన్ చేసేలా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే ఎక్కువ మంది ఆటగాళ్లను రీటెయిన్ చేసుకునేలా లేదు. అయితే న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఎస్ఆర్‌హెచ్ రీటెయిన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఐపీఎల్ మెగావేలం విశేషాలు ఇవే..! గరిష్ఠంగా ఆటగాడికి ఎన్ని రూ.కోట్లు ఇవ్వొచ్చంటే?
🚨 It's #Retention time ! 🚨
— Star Sports (@StarSportsIndia) November 29, 2021
And there's only one place you need to head to, to find out who's retained and who's finding new colours to don! 😄
Catch all the news as it breaks with #VIVOIPLRetentionLIVE:
Nov 30, 9:30 PM onwards | Star Sports & Disney+Hotstar pic.twitter.com/at7pUcyvWv
సీఎస్కే, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు తమకు గరిష్టంగా అవకాశం ఉన్న నలుగురు ఆటగాళ్లను రీటెయిన్ చేసుకున్నట్లు సమాచారం. ఆర్సీబీ ఫ్రాంచైజీ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రీటెయిన్ చేసుకునేందుకు మొగ్గు చూపింది. ముంబై రోహిత్, బుమ్రాను మళ్లీ తీసుకోగా.. కేకేఆర్ ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ లను రిటెయిన్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్, షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను రీటెయిన్ చేసినట్లు తెలుస్తోంది. నేడు ఆటగాళ్ల రీటెన్షన్ జాబితాపై క్లారిటీ రానుంది.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్, షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్
Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?
ఇక వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించే పర్స్ విలువను బీసీసీఐ రూ.5 కోట్ల మేర పెంచగా ప్రస్తుత విలువ రూ.90 కోట్లకు పెరిగింది. అయితే ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునే సంఖ్యను బట్టి ఈ విలువ మారుతుంది. ఆటగాళ్లను రీటెయిన్ చేసుకుంటే ఈ విలువ ఇలా తగ్గిపోతుంది.
రిటెయిన్ చేసుకోకుంటే ఫ్రాంచైజీకి రూ.90 కోట్లు పర్స్ విలువ ఉంటుంది
ఒకరిని తీసుకుంటే : రూ.74 కోట్లు
ఇద్దరిని తీసుకుంటే : రూ.66 కోట్లు
ముగ్గురిని తీసుకుంటే : రూ.57 కోట్లు
నలుగురిని తీసుకుంటే : రూ.48 కోట్లకు పడిపోతుంది.