News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL 2022 Retention Rules, Purse Limit: ఐపీఎల్‌ మెగావేలం విశేషాలు ఇవే..! గరిష్ఠంగా ఆటగాడికి ఎన్ని రూ.కోట్లు ఇవ్వొచ్చంటే?

ఐపీఎల్ రీటెన్షన్ పాలసీని బీసీసీఐ ప్రకటించింది. నవంబర్‌ 30లోపు ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని తీసుకుంటుందో జాబితా సమర్పించాలి. నిబంధనలు ఇవే..!

FOLLOW US: 
Share:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రీటెన్షన్‌ సమయం ముగుస్తోంది. నవంబర్‌ 30లోపు ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని తీసుకుంటుందో బీసీసీఐకి జాబితా సమర్పించాలి. ఇందుకోసం నిర్వాహక కమిటీ కొన్ని నిబంధనలు విధించింది. ఇదంతా పూర్తయ్యాక కొత్త ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. ఆ తర్వాత డిసెంబర్లో మెగా వేలం జరగనుంది.

గరిష్ఠంగా ఎందరు?

మెగా వేలం ముందు ఎనిమిది జట్లు నలుగురు ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకోవచ్చు. అందులో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులు ఉండొచ్చు. ముగ్గురు భారతీయులు ఒక విదేశీయుడిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీలు తమ అవసరాలను ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పేర్లను ఎంపిక చేసుకొనేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు రీటెయిన్‌ చేసుకున్నాక మిగిలిన ఆటగాళ్లలో ముగ్గురిని కొత్త ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. ఇద్దరు భారతీయులు, ఒక విదేశీయుడిని ఎంచుకోవచ్చు.

ఎవరికి ఎంత?

  • 4 ఆటగాళ్లు: రూ.16 కోట్లు, రూ.12 కోట్లు, రూ.8 కోట్లు, రూ.6 కోట్లు మొత్తంగా రూ.42కోట్లు వాడుకోవచ్చు.
  • 3 ఆటగాళ్లు: రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు మొత్తంగా రూ.33 కోట్లు వాడుకోవచ్చు.
  • 2 ఆటగాళ్లు: రూ.14 కోట్లు, రూ.10 కోట్లు మొత్తంగా రూ.22 కోట్లు వాడుకోవచ్చు.
  • 1 ఆటగాడు: రూ.14 కోట్లు లేదా భారత్‌ జట్టుకు ఎంపికవ్వని ఆటగాడైతే రూ.4 కోట్లు వాడుకోవచ్చు.

పర్స్‌ ఎంత?

ఇక వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించే పర్స్‌ విలువను బీసీసీఐ పెంచింది. గతంలో ఫ్రాంచైజీలు రూ.85 కోట్లు వాడుకొనేవి. ఇప్పుడు మరో రూ.5 కోట్లు పెంచింది. మొత్తంగా మెగా వేలంలో రూ.90 కోట్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకుంటే ఈ విలువ తగ్గిపోతుంది.

  • ఎవరినీ తీసుకోకుంటే : రూ.90 కోట్లు
  • ఒకరిని తీసుకుంటే : రూ.76 కోట్లు
  • ఇద్దరిని తీసుకుంటే : రూ.66 కోట్లు
  • ముగ్గురిని తీసుకుంటే : రూ.57 కోట్లు
  • నలుగురిని తీసుకుంటే : రూ.48 కోట్లు

Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 28 Nov 2021 02:17 PM (IST) Tags: MI CSK SRH retention rules IPL 2022 Auction IPL teams Purse limit

ఇవి కూడా చూడండి

ICC World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? టాప్ ప్లేయర్ ఎవరు?

ICC World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? టాప్ ప్లేయర్ ఎవరు?

Shubman Gill: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కీలకం శుభ్‌మన్ గిల్‌నే - గణాంకాలు ఏం చెబుతున్నాయి?

Shubman Gill: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కీలకం శుభ్‌మన్ గిల్‌నే - గణాంకాలు ఏం చెబుతున్నాయి?

World Cup 2023: వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చేయాలి? - మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? పూర్తి షెడ్యూలు ఇదే!

World Cup 2023: వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చేయాలి? - మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? పూర్తి షెడ్యూలు ఇదే!

Asian Games 2023 : తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది !

Asian Games 2023 : తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది !

Asia Games 2023: రోలర్ స్కేటింగ్‌లో భారత పురుష, మహిళల జట్లకు కాంస్య పతకాలు

Asia Games 2023: రోలర్ స్కేటింగ్‌లో భారత పురుష, మహిళల జట్లకు కాంస్య పతకాలు

టాప్ స్టోరీస్

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్

వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్

Supreme Court: రేపే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - ఈ ధర్మాసనం వద్ద లిస్టింగ్

Supreme Court: రేపే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - ఈ ధర్మాసనం వద్ద లిస్టింగ్