By: ABP Desam | Updated at : 19 Sep 2021 11:53 PM (IST)
విరాట్ కోహ్లీ (File Photo)
Virat Kohli on RCB Captaincy: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల పరిమిత ఓవర్ల (అంతర్జాతీయ T20) క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంటజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి సైతం విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఐపీఎల్ 2021 సీజనే ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీకి చివరి సీజన్ కానుంది. ఆపై ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
View this post on InstagramA post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)
గత దశాబ్దకాలం నుంచి ఆర్సీబీ జట్టుకు కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ప్రతి ఏడాది కప్పు మాదే అంటూ ఐపీఎల్ లో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఐపీఎల్ లో మూడు పర్యాయాలు ఫైనల్ చేరుకున్నప్పటికీ టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ టీ20లకు టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత తప్పుకోనున్నాడు. ఒత్తిడిని తట్టుకోలేక సతమతం అవుతున్న కోహ్లీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తో తన కెప్టెన్సీ ముగిస్తుందని వీడియో రూపంలో తెలిపాడు.
Also Read: IPL 2021, CSK vs MI: షాక్..! రోహిత్ లేకుండా బరిలోకి ముంబయి.. కెప్టెన్‌గా పొలార్డ్
గత తొమ్మిదేళ్లుగా ఆర్సీబీకి సారథ్యం వహిస్తున్నాను. అయితే ఆటగాడిగా, కెప్టెన్ గా పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. పని భారం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని మేనేజ్‌మెంట్‌కు నేటి సాయంత్రం నా నిర్ణయాన్ని వెల్లడించాను. తనకు ఇన్నిరోజులు మద్దతు తెలిపిన అభిమానులు, మేనేజ్ మెంట్, సహచర ఆటగాళ్లకు వీడియో ద్వారా ధన్యవాదాలు తెలిపాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ కెప్టెన్‌గా తన జర్నీని చాలా ఎంజాయ్ చేశానని, ఈ ఐపీఎల్ సీజన్ తరువాత ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Washington Sundar Catch: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సుందర్ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
Babar Azam: ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌ల్లో విఫలం - అయినా బాబర్‌కు ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డు - ఎలా సాధ్యం?
IND Vs NZ Toss Update: న్యూజిలాండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన హార్దిక్!
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్