అన్వేషించండి

Divya Deshmukh: ఆట క‌న్నా, అందంపైనే ప్రేక్ష‌కుల ఫోక‌స్- చెస్ ప్లేయర్ సంచలన ఆరోపణలు

Chess Player Divya Deshmukh: ఇటీవల జరిగిన టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణలు చేసింది.

Divya Deshmukh Alleges Sexism By Spectators :  చెస్ టోర్నీ చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు త‌న‌ను వేధింపుల‌కు గురి చేసారంటూ  భార‌తీయ చెస్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్(Chess Player Divya Deshmukh)సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవ‌ల నెద‌ర్లాండ్స్‌లో జ‌రిగిన టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నీ( Tata Steel Masters Tournament)లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆమె పేర్కొంది. 

భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్ ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నిర్వహించిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంది.  అయితే ఈ  చెస్ టోర్నీ వీక్షించేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు ఆట మీద ధ్యాస క‌న్నా.. త‌న కురులు, దుస్తులు, మాట‌తీరుపైనే ఫోక‌స్ పెట్టార‌ని దివ్య ఆరోపించింది. చెస్ లో క్రీడాకారిణులు అంటే ప్రేక్షకులకు చులకన భావం ఉందని,  పురుషులు చెస్ ఆడుతుంటే ప్రేక్షకులు వారి నైపుణ్యం గురించి మాట్లాడుకుంటారని, కానీ, మహిళలు చెస్ ఆడుతుంటే ప్రేక్షకుల దృష్టి అంతా ఆ క్రీడాకారిణులు ధరించిన దుస్తులు, ఆమె కట్టుబొట్టు, యాస... ఇలాంటి అనవసర విషయాలపైనే ఉంటుందని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది.  అసలు ఆటగాళ్లను ఎందుకిలా పురుషులు, మహిళలు అంటూ వేరు చేసి చూస్తారు? అని ప్రశ్నించింది. అసలు ఇటువంటి అంశాల గురించి ఎప్పట్నించో తాను  మాట్లాడాలనుకుంటున్నానని, కానీ ఇప్పుడు సమయం వచ్చిందని వివరించింది. అంతేకాదు, అసలు తాను ఏ మీడియా ఇంటర్వ్యూకైనా హాజరైనా ఇదే పరిస్థితి అని, ఆట గురించి వదిలేసి, ఇతర విషయాలే ప్రస్తావనకు వస్తుంటాయని అసహనం వ్యక్తం చేసింది.

నాగ‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అంత‌ర్జాతీయ మాస్ట‌ర్ ప్లేయ‌ర్ దివ్య‌.. గ‌త ఏడాది ఏషియ‌న్ వుమెన్స్ చెస్ చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది. ఇప్పుడు ప్రస్తుతం చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాతో కొనసాగుతోంది. గతేడాది ఆసియా మహిళల చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. అయితే కొన్నిరోజుల కిందట నెదర్లాండ్స్ లోని విక్ ఆన్ జీ నగరంలో జరిగిన చెస్ టోర్నీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను దివ్య దేశ్ ముఖ్ సోషల్ మీడియా పోస్టు రూపంలో అందరితో పంచుకుంది.   టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నీలో 4.5 స్కోర్‌తో ఛాలెంజ‌ర్స్ సెక్ష‌న్‌లో దివ్య దేశ్‌ముక్ 12వ స్థానంలో నిలిచింది. అప్పుడే త‌న గేమ్ గురించి ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని, కేవ‌లం త‌న అందం గురించే ప్రేక్ష‌కులు మాట్లాడుకుంటున్న‌ట్లు  మరోసారి తెలిసిందంది. 

అసలు ఒక్క చెస్ లోనే కాదు, మహిళలు తమ దైనందిన జీవితంలో ఇలాంటివి రోజూ ఎదుర్కొంటూనే ఉంటారని, మహిళలకు ఇకనైనా సమాన గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాలని భావిస్తున్నానని దివ్య దేశ్ ముఖ్ తన పోస్టులో పేర్కొంది. 

చిన్న వయసులోనే చెస్ పై ఆసక్తి చూపించిన దివ్య (2012)లో అండర్ 7, (2013, 2014) అండర్ 9, 2015,2016) అండర్ 11, (2017) అండర్ 13, (2017, 2018, 2019) అండర్ 15 టోర్నీల్లో ఛాంపియన్గా నిలిచింది. ఇక 2019లో సీనియర్ టోర్నీల్లో దివ్య.. తాను ఆడిన మొదటిసారే కాంస్యం గెలిచింది.
ఇక కొవిడ్ బ్రేక్ తర్వాత 2022లో నాగ్పుర్ సీనియర్ కేటగిరీలో పాల్గొంది. ఆ పోటీల్లో ఛాంపియన్గా నిలిచి.. సీనియర్ పోటీల్లో గెలిచిన పిన్న వయస్కురాలిగా (16 సంవత్సరాల 7 నెలల 20 రోజులు) రికార్డు సృష్టించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget