అన్వేషించండి

IND vs WI 2nd ODI: తడబడ్డ టీమిండియా, బౌలింగ్‌లో జాగ్రత్త పడాల్సిందే, వెస్టిండీస్ లక్ష్యం ఎంతంటే?

IND vs WI, 2nd ODI: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 238 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (64: 83 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెప్టెన్ రోహిత్ శర్మతో (5: 8 బంతుల్లో) పాటు రిషబ్ పంత్ (18: 34 బంతుల్లో, మూడు ఫోర్లు) ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు వచ్చాడు. అయితే రోహిత్ ప్రయోగం ఫలించలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ శర్మను అవుట్ చేసి కీమర్ రోచ్ భారత్‌‌కు మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలను (18: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) ఇన్నింగ్స్ 12వ ఓవర్లలో అవుట్ చేసిన ఒడియన్ స్మిత్ భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 43 పరుగులు మాత్రమే.

ఈ దశలో కేఎల్ రాహుల్ (49: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వేగంగా ఆడాడు. భారత్ ఇన్సింగ్స్‌లో నమోదైన రెండు సిక్సర్లనూ కేఎల్ రాహులే కొట్టాడు. సూర్యకుమార్ క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో కేఎల్ వేగంగా ఆడటంతో రన్‌రేట్ నిలకడగా సాగింది. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కేఎల్ రాహుల్ అవుటయ్యాడు.

కేఎల్ రాహుల్ అవుట్ కావడం క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో (24: 41 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దరూ కూడా అవుటయ్యారు. చివర్లో దీపక్ హుడా (29: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడాడు. అయితే టెయిలెండర్లలో ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. చివర్లో చాహల్ (11 నాటౌట్: 10 బంతుల్లో, ఒక ఫోర్) విలువైన పరుగులు జోడించాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది.  వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకేల్ హొస్సేన్, ఫాబియన్ అలెన్‌లు తలో వికెట్ తీశారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్‌కు వికెట్ దక్కడం విశేషం.

IND vs WI 2nd ODI: తడబడ్డ టీమిండియా, బౌలింగ్‌లో జాగ్రత్త పడాల్సిందే, వెస్టిండీస్ లక్ష్యం ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget