అన్వేషించండి

Ind vs SA, Rishabh pant century: ధోనీ ఇన్నేళ్లలో చేయలేనిది.. పంత్‌ రెండేళ్లలో చేసేశాడు..! ఆసియా ఆవల రిషభ్ రికార్డు

రిషభ్ పంత్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎంఎస్‌ ధోనీకి సాధ్యమవ్వని ఘనతలను అందుకుంటున్నాడు. ఆసియా ఆవల మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు.

Ind vs SA, Rishabh pant century: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎంఎస్‌ ధోనీకి సాధ్యమవ్వని ఘనతలను అందుకుంటున్నాడు. ఆసియా ఆవల మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో అతడు శతకం బాదేశాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఏ మాత్రం బాగాలేదు. కొన్నాళ్లుగా అతడు అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాడు. చెత్త షాట్లకు ఔటవుతున్నాడు. అతడు మరింత పరిణతిగా ఆడాలని చాలామంది మాజీ క్రికెటర్లు చెబుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అత్యంత కీలకమైన టెస్టు మ్యాచులో అతడు వారి ఆశలను నెరవేర్చాడు.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

కేప్‌టౌన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్సర్లతో 100 పరుగులతో రిషభ్ పంత్‌ అజేయంగా నిలిచాడు. ఇందుకోసం అతడు 236 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఎంతో విలువైన, చక్కని షాట్లను ఆడాడు. టీమ్‌ఇండియా ఈ ఇన్నింగ్సులో 198 పరుగులు చేస్తే అందులో అతడివే సగం కావడం ప్రత్యేకం. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 179 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

ఇక రికార్డు విషయానికి వస్తే టీమ్‌ఇండియా తరఫున ఎంతో మంది కీపింగ్‌ చేశారు. సొంతగడ్డపై చాలా శతకాలైతే కొట్టారు కానీ ఆసియా ఆవల చేసింది మాత్రం తక్కువే! ఇప్పటి వరకు నమోదైనవి కేవలం ఏడు. అందులో మూడు రిషభ్ పంత్‌వే.  2018లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 114, 2018/19లో సిడ్నీలో ఆసీస్‌పై 159*, 2021/22లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 100* చేశాడు. అంతకు ముందు 1952/53లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో  వి.మంజ్రేకర్‌ 118, 2002లో అజయ్‌ రాత్రా సెయింట్‌ జాన్స్‌లో వెస్టిండీస్‌పై 115*, 2016లో వెస్టిండీస్‌పై గ్రాస్‌ఐస్‌లెట్‌లో వృద్ధిమాన్‌ సాహా 114  సెంచరీలు సాధించారు. దేశానికి సుదీర్ఘ సేవలు అందించిన ఎంఎస్ ధోనీ మాత్రం ఆసియా ఆవల ఒక్క సెంచరీనైనా కొట్టలేదు.

టాప్ హెడ్ లైన్స్

Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Prasidh Krishna Out : ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు
ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు.. అతని ప్లేస్ లో..
Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget