By: ABP Desam | Updated at : 14 Jun 2022 01:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్, దక్షిణాఫ్రికా, ( Image Source : BCCI )
IND vs SA 3rd T20: అంతర్జాతీయ క్రికెట్లో భారత గడ్డపై ఏ జట్టు అడుగుపెట్టినా భయపడుతుంది! ఒక్క దక్షిణాఫ్రికా తప్ప! అవును, మీరు చదువుతున్న స్టేట్‌మెంట్ కరెక్టే! 12 ఏళ్లుగా సఫారీలకు టీమ్‌ఇండియాపై తిరుగేలేదు. తాజాగా మరో సిరీస్‌ను బుట్టలో వేసుకొనేందుకు వారు రెడీగా ఉన్నారు. విశాఖలో జరిగే మూడో టీ20 గెలిస్తే చాలు. 3-0తో సిరీస్ ఎగరేసుకుపోతారు. మరి సఫారీల జోరును పంత్ సేన అడ్డుకోగలదా? తిరిగి మూమెంటమ్ అందుకోగలదా?
విశాఖలో డేంజరే!
ఐదు టీ20ల సిరీసులో దక్షిణాఫ్రికా 2-0తో పైచేయి సాధించింది. ఇప్పుడు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచుకు సిద్ధమైంది. విశాఖ తీరాన జరిగే ఈ మ్యాచ్ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. పిచ్, వాతావరణ పరిస్థితులు మాత్రం పంత్ సేనకు అనుకూలంగా లేవు. ఇప్పటి వరకు ఇక్కడ రెండే టీ20ల జరిగితే రెండూ లో స్కోరింగ్ గేమ్సే! రెండింట్లోనూ ఛేదన జట్టే గెలిచింది. 2016లో లంకేయులను 82కే కట్టడి చేసిన భారత్ 14 ఓవర్లకే విజయం అందుకుంది. 2019లో టీమ్‌ఇండియాను 126/7కు నియంత్రించిన ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపు తలుపు తట్టింది. స్పిన్నర్లు, పేసర్లకు పిచ్ సహకరిస్తుంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉక్కపోత ఎక్కువ కాబట్టి రెండో ఇన్నింగ్‌లో బంతిపై పట్టు చిక్కదు. అంటే టాస్ గెలిస్తే దాదాపుగా మ్యాచ్ గెలిచినట్టే!
దీపక్ హుడా ఎంట్రీ?
సీనియర్లకు విశ్రాంతినిచ్చిన ఈ సిరీసులో కుర్రాళ్లు అంచనాలను అందుకోవడం లేదు. కెప్టెన్ రిషభ్ పంత్‌కు పరీక్షలు ఎదురవుతున్నాయి. భువనేశ్వర్ కుమార్ చివరి మ్యాచులో 3 వికెట్లు తీసి లయ అందుకున్నాడు. విశాఖలోనూ ప్రమాదకరంగానే ఉంటాడు. అవేశ్ ఫర్వాలేదు. హర్షల్ పటేల్ వైవిధ్యం సరిపోవడం లేదు. వీరిద్దరూ వికెట్లు తీయడం అవసరం. ఈ మ్యాచులో అర్షదీప్ లేదా ఉమ్రాన్ మాలిక్‌కు ఎవరో ఒకరు చోటివ్వక తప్పదు. యూజీ, అక్షర్ పటేల్ స్పిన్‌లో పస కనిపించడం లేదు. ఇషాన్ ఓపెనింగ్ సూపర్. రుతురాజ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. స్పిన్‌లో దుమ్మురేపుతున్న శ్రేయస్ పేస్‌కు ఇబ్బంది పడుతున్నాడు. బహుశా అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకోవచ్చు. హార్దిక్, డీకే, అక్షర్, పంత్ మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి.
ఎవరో ఒకరు!
పర్యాటక సఫారీలు సరికొత్త ఉత్సాహంతో ఉన్నారు. ఎవరో ఒకరు మ్యాచులో దూకుడుగా ఆడి మూమెంటమ్ షిఫ్ట్ చేస్తున్నారు. తొలి మ్యాచులో వాండర్ డుసెన్, రెండో మ్యాచులో హెన్రిచ్ క్లాసెన్ అలాంటి ఇన్నింగ్సులు ఆడారు. డేవిడ్ మిల్లర్ మాత్రం అస్సలు ఔటవ్వకుండా యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. మణికట్టు గాయంతో ఉన్న డికాక్ కోలుకుంటే రెజా హెండ్రిక్స్ బయటకు వెళ్లక తప్పదు. తెంబా బవుమా నిలకడగా ఆడుతున్నా స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉంది. డ్వేన్ ప్రిటోరియస్ ఫ్లోటర్‌గా ఆకట్టుకుంటున్నాడు. రబాడా, నోకియా, పర్నెల్ బౌలింగ్ బాగుంది. 12 ఏళ్లుగా భారత గడ్డపై సఫారీలు ఒక్క సిరీసైనా ఓడిపోలేదు. ఈ మ్యాచ్ గెలిస్తే మరోటి వారి ఖాతాలో చేరుతుంది.
IND vs SA 3rd T20 Probable Playing XI
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా / శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: రెజా హెండ్రిక్స్ తెంబా బవుమా, వాండర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పర్నెల్, రబాడా, లుంగి ఎంగిడి / కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోకియా, తబ్రైజ్ శంషి
Starc-Maxwell Ruled Out: ఆరంభానికి ముందే అపశకునం - కంగారూలకు బిగ్ షాక్ - ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
IND vs AUS: అసలు పోరుకు ముందు ఆఖరి మోక - కళ్లన్నీ వారిమీదే!
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే - టాప్-5లో ఇద్దరూ మనోళ్లే
Nortje-Magala Ruled Out: తలచినదే జరిగినది! - సఫారీ జట్టుకు వరుస షాకులు
ODI World Cup 2023: నెదర్లాండ్స్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్ - పెద్ద ప్లానింగే!
ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
/body>