IND Vs NZ 2nd T20I Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ - భారత్‌కు చావో రేవో!
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. దీంతో కివీ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. మొదటి టీ20లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 2-0తో గెలుచుకోవాలని అనుకుంటోంది. దీంతో హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ మ్యాచ్‌కు భారత్ తన తుదిజట్టులో ఒకే ఒక మార్పు చేసింది. ఏస్ బౌలర్ ఉమ్రాన్ మలిక్ స్థానంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో కూడా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయమే. రాహుల్ త్రిపాఠి వన్‌డౌన్లో, సూర్య సెకండ్ డౌన్‌లో రావాల్సిందే. ఫ్యాన్స్ సూర్యకుమార్ మెరుపుల కోసం ఎదురు చూస్తున్నారు. దీపక్ హుడా గురించి తెలిసిందే. బ్యాటింగ్ విభాగమైతే భీకరంగానే ఉంది. కానీ మొదటి మ్యాచ్‌లో 176 పరుగుల స్కోరును కూడా భారత్ ఛేదించలేక పోయింది.
బౌలింగ్ విషయానికి వస్తే... అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి ఫుల్ టైమ్ పేసర్లు. అదనంగా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ వేయగలడు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జట్టు కూర్పు పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవు.
లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ ప్రతిసారీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుంది. ఈ విజయాలన్నీ కొంత ఏకపక్షంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వికెట్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు పిచ్ నుంచి మరింత సహాయం అందుతున్నట్లు స్పష్టమైంది. అయితే రాత్రిపూట రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను మంచు ఇబ్బంది పెట్టవచ్చు.
భారత జట్టు లక్నోలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. రెండు సార్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190కు పైగా పరుగులు చేసింది. భారత్ ఇక్కడ శ్రీలంక, వెస్టిండీస్‌లను ఓడించింది.
రెండో టీ20 మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. అయితే వర్షం కురిసే అవకాశం లేదు. ఇది అభిమానులకు గుడ్ న్యూస్. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
భారత తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ తుదిజట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
View this post on Instagram