IND vs ENG Cricket Score LIVE: ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఓటమి
IND vs ENG 3rd Test Score LIVE Updates: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
LIVE
Background
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు టెయిలెండర్ల వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. దీంతో ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల భారీ ఆధిక్యాన్ని మూటకట్టుకుంది. అంతకుముందు భారత్ టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
IND vs ENG Cricket Score LIVE: బ్యాట్లెత్తేశారు... మ్యాచ్ వదిలేశారు...
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ అత్యంత ఘోరమైనా విఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి తన ఖాతాలో వేసుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ సేనను ఆండ్రసన్, రాబిన్‌సన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు 1-1తో సమమైంది.
IND vs ENG Cricket Score LIVE: మెరుపులు కాసేపే.. అంతా పెవిలియన్‌కు క్యూ కట్టేవారే..
రహానే తర్వాత ఎవరూ ఓ ఓవర్ పాటు క్రీజ్‌లో ఉండి ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోయారు. పంత్, షమి, ఇషాంత్ శర్మ ఇంతా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టారు. షమీ, జడేజా కాసేపు మెరుపులు మెరిపించారు.
IND vs ENG Cricket Score LIVE: మళ్లీ రహానే విఫలం
రహానే మళ్లీ ఫెయిల్ అయ్యాడు. మొదట్లో రెండు ఫోర్లు కొట్టి ఊపు తీసుకొచ్చిన రహానే.. కోహ్లీకి అండగా నిలిచాడు. 237పరుగుల వద్ద కోహ్లీ ఔటవగా.. తర్వాతి ఓవర్లోనే..రహానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 239పరుగులు చేసింది. ఇంకా 115 పరుగులు వెనకంజలో ఉంది.
IND vs ENG Cricket Score LIVE: ఫిఫ్టీ చేసి ఔటైన కోహ్లీ... తక్కువ పరుగులు తేడాలోనే రెండు వికెట్లు డౌన్
పుజారా ఔటైన తర్వాత కోహ్లీకి రహానే జత కలిసి స్కోరు బోర్డును ముందుకు కదలించారు. స్కోరు నెమ్మదిగా పరుగులు పెట్టిస్తూనే... కోహ్లీ అర్థసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
IND vs ENG Cricket Score LIVE: సెంచరీ చేయకుండానే వెనుదిరిగిన పుజారా.. 215 పరుగుల వద్దే మూడో వికెట్ డౌన్
ఓవర్ నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే భారత్ తన మూడో వికెట్ కోల్పోయింది. నాల్గో రోజు స్టార్టింగ్ నుంచి నెమ్మదిగా ఆడినా పుజారా తన వికెట్‌ను సమర్పించుకోక తప్పలేదు. రాబిన్సన్ బౌలింగ్‌గా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంజిక్యా రహానే కోహ్లీకి జతగా వచ్చాడు.