అన్వేషించండి

Roy, Root, Stokes duck out: బాబోయ్‌ బుమ్రా! ఇంగ్లాండ్‌ టాప్‌ 4లో ముగ్గురు డకౌట్‌!

IND vs ENG 1st odi: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఓవల్‌ మైదానంలో ఆంగ్లేయులకు చుక్కలు చూపిస్తోంది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఓవల్‌ మైదానంలో ఆంగ్లేయులకు చుక్కలు చూపిస్తోంది. నిలబడి సిక్సర్లు దంచికొట్టే ప్రత్యర్థి టాప్‌ ఆర్డర్‌ను భారత బౌలర్లు కకావికలం చేసేశారు. 3 ఓవర్లు ముగిసే లోపే 7 పరుగులకే 3 వికెట్లు తీశారు. ఆ ముగ్గురూ డకౌటే కావడం ప్రత్యేకం.

ఓవల్‌ మ్యాచులో టీమ్‌ఇండియా (IND vs ENG 1st odi) టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బంతి అందుకున్న క్షణం నుంచి పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతిని ఆడబోయిన జేసన్‌ రాయ్‌ (Jason Roy) వికెట్టైతే ఎగిరిపోయింది. వైడ్‌ లైన్‌లో వచ్చిన బంతి రాయ్‌ స్వింగ్‌ అవుతుందని భావించాడు. కానీ బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి వికెట్లను ఎగరగొట్టింది. ఆఖరి బంతికి జోరూట్‌ (Joe Root) సైతం ఇలాగే బోల్తా పడ్డాడు. వైడ్‌ లైన్‌లో వెళ్తున్న బంతిని ఆడబోయాడు. బ్యాటుకు తగిలిన బంతి వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది.

ఆ తర్వాతి ఓవర్‌ నాలుగో బంతికి మహ్మద్‌ షమి అద్భుతం చేశాడు. రౌండ్‌ ది వికెట్‌ వెళ్లి బౌలింగ్‌ చేశాడు. స్వింగైన బంతి బెన్‌ స్టోక్స్‌ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ రిషభ్ పంత్‌ చేతుల్లో పడింది. దాంతో 7 పరుగులకే ఇంగ్లాండ్‌ 3 వికెట్లు నష్టపోయింది. ఆఖరి టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన జానీ బెయిర్‌స్టో (7)నూ బుమ్రానే (Jasprit Bumrah) పెవిలియన్‌కు పంపించాడు. ఏ మాత్రం డీవియేట్‌ అవ్వని 5.3 వ బంతి జానీ బ్యాటుకు తగిలి గాల్లోకి లేచింది. ఫస్ట్‌ స్లిప్‌లోకి ఎగిరిన పంత్‌ దానిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాంతో 17 పరుగులకు ఇంగ్లాండ్‌ 4 వికెట్లు పడిపోయింది. 

ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ అవ్వడం ఇది రెండోసారి. 2018లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో, రూట్‌ను ఔట్‌ చేసింది. ఇప్పుడు ఓవల్‌లో వారి సొంతగడ్డపై రాయ్‌, రూట్‌, స్టోక్స్‌ను టీమ్‌ఇండియా డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించింది. మొత్తంగా 7 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 4 వికెట్లు నష్టపోయి 26 పరుగులతో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget