ICC WTC Points Table: ఐదో టెస్టు ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు! టీమ్‌ఇండియా క్వాలిఫై అవ్వగలదా?
ICC WTC Points Table: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. దాంతో సిరీస్ 2-2తో సమమైంది. ఫలితంగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి.

ICC WTC Points Table: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 378 పరుగుల టార్గెట్‌ను ఆంగ్లేయులు 7 వికెట్ల తేడాతో ఛేదించారు. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (142*; 173 బంతుల్లో 15x4, 1x6), జానీ బెయిర్ స్టో (114*; 173 బంతుల్లో 19x4, 1x6) శతకాలు బాదేసి భారత ఆశలను ఆడియాసలు చేశారు. దాంతో సిరీస్ 2-2తో సమమైంది. ఫలితంగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి.
ఈ ఓటమితో టీమ్‌ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 53.47 శాతంతో ఉంది. మొత్తంగా 3 సిరీసుల్లో 3 విజయాలు, 2 ఓటములు, 2 డ్రా చేసుకొని 77 పాయింట్లు సాధించింది. భారీ తేడాతో గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ స్థానంలో మెరుగదలేమీ లేదు. 33.33 శాతంతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4 సిరీసుల్లో 5 మ్యాచులు గెలిచి, 7 ఓడింది. 4 డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ సిరీసుకు ముందు వరుస ఓటములు ఎదురవ్వడంతో ఆంగ్లేయులు చాలా వెనకబడ్డారు.
Also Read: సెంచరీలతో ఉతికారేసిన జానీ, రూట్! టీమ్‌ఇండియా దశాబ్దాల ఆశలు గల్లంతు - సిరీస్ సమం
Also Read: ఆ రెండు విషయాలే భారత్ కొంపముంచాయి - మాజీ కోచ్ రవిశాస్త్రి విమర్శలు
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 3 సిరీసుల్లో 6 మ్యాచులు గెలిచి 3 డ్రా చేసుకుంది. ఒక్క మ్యాచులోనూ ఓటమి పాలవ్వకపోవడం గమనార్హం. దాంతో 77.78 శాతంతో నంబర్‌వన్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టు 71.43 శాతంతో రెండో ప్లేస్‌లో ఉంది. ఇప్పటి వరకు సఫారీలు 3 సిరీసులు ఆడగా 5 విజయాలు, 2 ఓటములు సాధించారు. ఇక పాకిస్థాన్ (52.38), వెస్టిండీస్ (50) శ్రీలంక (47.62)తో వరుసగా 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (25.93), న్యూజిలాండ్ (25.93), బంగ్లాదేశ్ (13.33) ఆఖరి రెండు స్థానాలకు పరిమితమవ్వడం గమనార్హం.
Passion 🔥#ENGvsIND #Cricket pic.twitter.com/usdNuCYowF
— Wisden India (@WisdenIndia) July 4, 2022
Tons in both innings 💯
— England Cricket (@englandcricket) July 5, 2022
Another fourth innings masterclass 🙌
Sees us home 🏠
When @jbairstow21 goes on the attack 🧨
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/16WZRwDQyn
Well, it took a while but that was worth the wait 🔥
— England Cricket (@englandcricket) July 5, 2022
Thanks @BCCI for a brilliant series of Test cricket 👏
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IRqUwT7apV
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

