అన్వేషించండి

Ind vs Eng 5th Test: ఆ రెండు విషయాలే భారత్ కొంపముంచాయి - మాజీ కోచ్ రవిశాస్త్రి విమర్శలు

Ravi Shastri Slams Team India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టీమిండియా పరిస్థితిపై మాజీ కోచ్ రవి శాస్త్రి తీవ్రంగా స్పందించాడు. డిఫెన్స్, బెరుకుగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు.

Ind vs Eng 5th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టీమిండియా ప్రస్తుత పరిస్థితిపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. డిఫెన్స్ ఆడటం, వెనుకంజ వేస్తూ బ్యాటింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కుప్పకూలిందన్నాడు. దాంతో ఓటమి పాలవుతామని భావించిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారిగా మ్యాచ్‌ను శాసించే స్థితికి వచ్చిందని.. అందుకే భారత డిఫెన్స్ బ్యాటింగ్, బెరుకుగా బ్యాటింగ్ చేయడమే కారణమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

లంచ్ తరువాత వణుకు మొదలైంది..
ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో ఓ దశలో 132 పరుగుల ఆధిక్యంతో ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 245 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియాకు 378 పరుగుల ఆధిక్యం లభించింది. కానీ కొండంత లక్ష్యం ముందున్నా కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారని.. దాంతో ప్రస్తుతం వారు విజయానికి 119 పరుగుల దూరంలో నిలిచారని రవిశాస్త్రి గుర్తుచేశాడు. టీమిండియా మెరుగైన స్థితిలో ఉన్నా అటాకింగ్ చేయలేదు. కనీసం కాన్ఫిడెన్స్‌గా ఆడలేదు. ముఖ్యంగా లంచ్ తరువాత భారత బ్యాటర్లలో వణుకు మొదలైందన్నాడు. వికెట్లు కోల్పోతున్నా, పరుగుల మీద ఫోకస్ చేయడంలో వెనుకంజ వేయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లిపోయింది. 2-1తో ఉన్న భారత్ 2-2 తో సిరీస్ ముగించే ఛాన్స్ ఉందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

బుమ్రా వ్యూహాలు బెడిసికొట్టాయి: పీటర్సన్
భారత తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీ వ్యూహాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. బుమ్రా వ్యూహాలు బెడిసికొట్టడంతో భారత్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. నాలుగోరోజు ఆటలో బుమ్రా వ్యూహాలు ఏవీ ఫలించలేదు. బౌలింగ్‌లోనూ కాస్త తగ్గినట్లు కనిపించాడు. రివర్స్ స్వింగ్ అవకపోవడంతో బ్యాటర్లకు సహకారం లభించింది. టెస్టు నాలుగోరోజు ముఖ్యంగా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ప్రత్యర్థి జట్టుకు అవకాశాలు పెంచిందని పీటర్సన్ భావించాడు. కనీసం మ్యాచ్ చివరిరోజైనా బుమ్రా ఏమైనా అద్భుతాలు చేస్తాడేమో చూద్దామంటూ తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాడు. 

378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. జో రూట్ (76 బ్యాటింగ్: 112 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (72 బ్యాటింగ్: 87 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
2027 ODI World Cup Venues: 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget