అన్వేషించండి

England New Test Captain: జో రూట్‌ వారసుడిగా బెన్‌స్టోక్స్‌! కెప్టెన్‌గా ప్రకటించిన ఈసీబీ

England New Test Captain: ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కొత్త సారథిని ఈసీబీ ఎంపిక చేసింది. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను నాయకుడిగా నియమించింది.

England New Captain Ben Stokes named new England test cricket captain taking over Joe Root: ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) ఎంపికయ్యాడు. జో రూట్‌ (Joe Root) వారసుడిగా అతడికే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఓటేసింది. జట్టును నడిపించేందుకు ఈ సీనియర్‌ ఆల్‌రౌండరే సమర్థుడని భావించింది. కాగా తనను కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు బెన్‌స్టోక్స్‌ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఐదేళ్లుగా టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్న జో రూట్‌ రెండు వారాల క్రితమే పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లాండ్‌ ఆడిన చివరి 17 టెస్టుల్లో కేవలం ఒక మ్యాచే గెలవడం అతడిపై అసంతృప్తికి దారితీసింది. మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు పెరిగాయి. ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆంగ్లేయులు ఆఖర్లో ఉన్నారు. దాంతో వెస్టిండీస్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన రూట్‌ ఆత్మావలోకనం చేసుకున్నాడు. బాగా ఆలోచించి నాయకత్వ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.

కొన్నేళ్లుగా బెన్‌స్టోక్స్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉంటున్నాడు. దాంతో సహజంగానే అతడు కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే పురుషుల క్రికెట్‌ ఎండీ రాబ్‌ కీ అతడి పేరునే కెప్టెన్సీకి ప్రతిపాదించాడు. ఈసీబీ ఆ ప్రతిపాదనను ఆమోదించింది. దాంతో ఇంగ్లాండ్‌ 81వ టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ ఎంపికయ్యాడు.

'టెస్టు కెప్టెన్సీ పాత్రను బెన్‌స్టోక్స్‌కు ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. తర్వాతి తరం టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన లక్షణాలు, మానసిక దారుఢ్యం అతడికి ఉన్నాయి. అతడు ఈ పదవిని చేపట్టేందుకు అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఈ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడీ పదవికి కచ్చితంగా అర్హుడు' అని రాబ్‌ కీ అన్నాడు.

'ఇంగ్లాండ్‌ టెస్టు జట్టును నడిపించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నిజంగా గొప్ప గౌరవం. ఈ సమ్మర్‌లోనే జట్టును నడిపించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఇంగ్లాండ్‌ క్రికెట్‌కు జో రూట్‌ అందించిన సేవలకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకు అతడో గొప్ప అంబాసిడర్‌. ఒక నాయకుడిగా నా అభివృద్ధిలో అతడి పాత్ర ఎంతైనా ఉంది. ఇప్పుడు అతడు నాతోనే ఉంటాడు' అని బెన్‌స్టోక్స్‌ పేర్కొన్నాడు.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget