ENG vs AUS 1st Ashes: దేవుడా..! 30లో 14 నోబాల్స్ వేసిన బెన్‌స్టోక్స్.. రెండింటినే నోబ్ ఇచ్చిన అంపైర్!!
గబ్బా టెస్టు రెండో రోజు స్టోక్స్ వేసిన తొలి ఐదు ఓవర్లలోనే ఏకంగా 14 నోబాల్స్ వేసినట్టు తెలిసింది. అందులో కేవలం రెండింటనే నోబాల్‌గా ప్రకటించారు. బ్రాడ్‌కాస్టర్ రిప్లేలతో విషయం బయటకు వచ్చింది.
రసవత్తరంగా సాగుతున్న యాషెస్ సిరీసులో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది! ఇంగ్లాండ్ పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఐదు ఓవర్లలోనే ఏకంగా 14 నోబాల్స్ వేశాడు. అంపైర్ ఇందులో కేవలం రెండింటినే నోబ్‌గా ఇచ్చాడు. అందులో ఒక బంతికి డేవిడ్ వార్నర్ ఔటవ్వడం గమనార్హం.
యాషెస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఆసీస్, ఇంగ్లాండ్ తొలి టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజైన, గురువారం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ 13వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేశాడు. మైదానంలోని అంపైర్ పరీక్షించడంతో అది నోబాల్‌గా తేలింది. మూడో అంపైర్‌కు చెప్పడంతో స్టోక్స్ ఒక అడుగు క్రీజు బయట వేశాడని తెలిసింది.
తొలి సెషన్లో స్టోక్స్ వేసిన తొలి ఐదు ఓవర్లలోనే ఏకంగా 14 నోబాల్స్ వేసినట్టు తెలిసింది. బ్రాడ్‌కాస్టర్ ఛానెల్ సెవెన్ రిప్లేలు వేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అందులో కేవలం రెండింటనే అంపైర్లు నోబాల్‌గా ప్రకటించారు. నోబాల్స్‌ను పరీక్షించే సాంకేతికత మ్యాచ్ ఆరంభానికి ముందే డౌన్ అయింది.
2019, డిసెంబర్ నుంచి నోబాల్స్‌ను మూడో అంపైర్ ఇస్తున్నారు. బౌలర్ తన ఫ్రంట్‌ఫుట్ బయట పెడుతున్నాడో లేదో తెలుసుకొనే సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మ్యాచులో దీనిని తొలిసారి పరీక్షించారు. ఆ సాంకేతికత ఈ మ్యాచులో డౌన్ అయింది. దాంతో స్టోక్స్ బతికి పోయాడు. కేవలం ఔటైన బంతుల్ని మాత్రమే మైదానంలోని అంపైర్లు పరీక్షిస్తున్నారు. కాగా స్టోక్స్ ఇన్ని నోబాల్స్ విసరడంపై అడగ్గా 'చాన్నాళ్ల తర్వాత వచ్చిన అతడు ఇంకా లయ అందుకోలేదు' అని ఇంగ్లాండ్ సారథి జో రూట్ బదులిచ్చాడు.
The technology for the TV umpire to call no-balls live isn't working at the Gabba.
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2021
Ben Stokes overstepped 𝟭𝟰 times in the first session - just one was called on-field, plus one on review 👀
(via @7Cricket) #Ashes pic.twitter.com/rn4HOAboqi
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి