News
News
X

Dinesh Karthik: ధోని కాంప్లిమెంట్ ఆనందాన్నిచ్చింది - దినేష్ కార్తీక్ ఏం రివీల్ చేశాడు?

మహేంద్ర సింగ్ ధోని తన కామెంటరీని మెచ్చుకున్నాడని దినేష్ కార్తీక్ తెలిపాడు.

FOLLOW US: 
Share:

Dinesh Karthik: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో ఒక ఆటగాడు జట్టు నుండి బయటకు వెళితే అతను పునరాగమనం చేయడం అంత తేలికైన పని కాదు. అయితే జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేయడం ద్వారా ప్రతి ఒక్కరినీ తప్పు అని నిరూపించిన వారు కూడా ఉన్నారు.

ఇందులో 37 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ పేరు లేటెస్ట్‌గా చేరింది. అతను ఇప్పటికీ ఐపీఎల్‌లో ముఖ్యమైన ఆటగాడిగా ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోని తనను పిలిచి అతని వ్యాఖ్యానాన్ని ప్రశంసించాడని వెల్లడించాడు.

అయితే 2022లో టీ20 ప్రపంచకప్ ఆడాక భారత జట్టులోకి దినేష్ కార్తీక్ పునరాగమనం ఇప్పుడు అసాధ్యమైందని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. 2021లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా జరిగిన మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్ కామెంటరీ విషయంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతని కొత్త టాలెంట్ కూడా అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న హోమ్ సిరీస్‌లో మరోసారి అతను కామెంటరీ బాక్స్‌లో కూర్చోవడం కనిపిస్తుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్ షోలో దినేష్ కార్తీక్ తన వ్యాఖ్యానం గురించి మాట్లాడుతూ ‘నేను దీన్ని చాలా ఆస్వాదించాను. ఈ గేమ్‌ను విశ్లేషకుడి కోణం నుంచి చూడటం, ఆ సమయంలో ప్రజలను గేమ్‌తో కనెక్ట్ చేసేలా ఏదైనా చెప్పడం నా ప్రయత్నం. అభిమానులకు సులభంగా అర్థమయ్యేలా కామెంటరీ సమయంలో మ్యాచ్ గురించి మాట్లాడేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను.’ అన్నాడు.

ధోనీ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, దినేష్ కార్తీక్‌ల అంతర్జాతీయ కెరీర్‌లు దాదాపు ఒకేసారి ప్రారంభమయ్యాయి. అయితే ధోని తనను తాను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత దినేష్ కార్తీక్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు. దీని కారణంగానే దినేష్ కార్తీక్ కెరీర్ కుదేలైందని చాలా మంది నమ్ముతున్నారు.

పోడ్‌కాస్ట్‌లో ధోని గురించి కూడా కార్తీక్ మాట్లాడాడు. మహేంద్ర సింగ్ ధోని తనకు ఫోన్ చేసి, తన కామెంటరీని ప్రశంసించినప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ‘ధోనీ నాకు ఫోన్ చేసి నా వ్యాఖ్యానం చాలా నచ్చిందని, మీరు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పాడు. నేను అతనికి కృతజ్ఞతలు తెలిపాను. అతను చాలా క్రీడలను చూస్తాడు. అతని వ్యాఖ్యానాన్ని మెచ్చుకోవడం నిజంగా పెద్ద అభినందనగా భావించాను.’ అన్నాడు.

కన్నడ నటుడు, కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్ ను దినేశ్ కార్తీక్ ఇటీవలే కలిశాడు. తనతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కార్తీక్ 'సలామ్ రాకీ భాయ్' అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

భారత వెటరన్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కన్నడ హీరో యశ్ ను కలిశాడు. యశ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దానికి 'సలాం రాకీభాయ్' అని క్యాప్షన్ పెట్టాడు. వీరిద్దరూ ఎక్కడ కలిశారు అనేది తెలపనప్పటికీ.. వారి డ్రెస్సింగ్ ను బట్టి ఏదో ఫంక్షన్ లో కలిసినట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో  దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు యశ్. గతేడాది విడుదలైన కేజీఎఫ్ రెండో భాగం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

Published at : 03 Mar 2023 08:39 PM (IST) Tags: RCB India vs England BCCI MS Dhoni Indian Cricket Team India vs Australia Dinesh Karthik

సంబంధిత కథనాలు

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే

శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?