News
News
వీడియోలు ఆటలు
X

బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ హవా- పసిడి పోరుకు మరో ముగ్గురు భారతీయ బాక్సర్లు

World Boxing C'ships: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత బాక్సర్లు అదరగొట్టారు.

FOLLOW US: 
Share:

World Boxing C'ships: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల  బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్   జోరు కొనసాగుతోంది.  50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న ఈ ఇందూరు (నిజామాబాద్) బాక్సర్..   గురువారం ముగిసిన సెమీఫైనల్స్ లో 5-0 తేడాతో 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్  వలెన్సియాను చిత్తుగా ఓడించి మరో పసిడి పతకానికి అడుగుదూరంలో నిలిచింది. 

కొలంబియాకు చెందిన  ఇన్‌గ్రిత్  వలెన్సియా.. టోక్యో ఒలింపిక్స్ లో  భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ను  ఓడించింది.  ఆమె ఆట గురించి అవగాహన ఉన్న  నిఖత్..  వలెన్సియాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడింది. ఆమె తనపై ఆధిపత్యం ప్రదర్శించకుండా  చూసుకుంటూ  విజయం సాధించింది.  కాగా  ఈ విజయంతో నిఖత్.. ఆదివారం జరుగబోయే ఫైనల్స్ లో వియాత్నాం బాక్సర్ .. ఎన్గుయోన్ థి టామ్ తో  తలపడనుంది. 

నీతూ, లవ్లీనాలూ  ఫైనల్స్‌కు.. 

నిఖత్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన  లవ్లీనా బోర్గోహెయిన్, యువ బాక్సర్  నీతూ ఘంగాస్, స్వీటీ బూరా  కూడా ఫైనల్స్ కు అర్హత సాధించారు.   75 కేజీల విభాగంలో పోటీ పడుతున్న  లవ్లీనా.. 4-1 తేడాతో  చైనా బాక్సర్   లీ కియాన్ ను ఓడించింది.   48 కేజీల విభాగంలో ఉన్న నీతూ.. 5-2 తేడాతో  కజకిస్తాన్ కు చెందిన  అలువా బల్కిబెకోవాపై గెలిచింది. ఇక  81 కిలోల విభాగంలో  ఆడుతున్న స్వీటి..  4-3 తేడాతో  ఆస్ట్రేలియా బాక్సర్   స్యు ఎమ్మా గ్రీన్‌‌ట్రీ పై గెలుపొందింది. నలుగురు బాక్సర్లు ఫైనల్స్ కు  చేరడంతో  భారత్ కు స్వర్ణాల సంఖ్య పెరిగే అవకాశముంది.  ఫైనల్స్ లో నీతూ.. చైనాకు  చెందిన లీనా వాంగ్ తో, ఆస్ట్రేలియా బాక్సర్  కైట్లిన్ పార్కర్ తో  లవ్లీనా, మంగోలియా  క్రీడాకారిణి  అల్టాం ట్‌సెట్‌సెగ్ తో తలపడనున్నారు. 

నిఖత్.. వరుసగా రెండోసారి.. 

గతేడాది ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా జరిగిన  వరల్డ్ సీనియర్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆడిన నిఖత్ జరీన్ వరుసగా   రెండోసారి తుది పోరుకు అర్హత సాధించడం గమనార్హం. మేరీ కోమ్ తర్వాత  ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్ మన తెలంగాణ అమ్మాయే. మేరీ కోమ్ వరుసగా ఆరుసార్లు ఫైనల్స్ కు వెళ్లింది. మొత్తంగా ఏడుసార్లు ఫైనల్స్ కు అర్హత సాధించి ఆరు స్వర్ణాలు సాధించింది.  గతేడాది నిఖత్..  5-0 తేడాతో థాయ్‌లాండ్ కు చెందిన  జిట్పాంగ్ ను ఓడించి  పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో ఆమె వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా   చరిత్ర సృష్టించింది. దీంతో పాటు  నిఖత్ జరీన్.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్వర్ణం సాధించిన విషయం  తెలిసిందే. వరుస పోటీలలో  స్వర్ణాలు నెగ్గుతున్న జరీన్..  వచ్చే ఏడాది  జరుగబోయే పారిస్ ఒలింపిక్స్ లో కూడా  స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

Published at : 24 Mar 2023 11:33 AM (IST) Tags: Boxing Nikhat Zareen World Boxing Championship Nithu Ganghas Paris Olympics 2024 Lovlina Borgohein

సంబంధిత కథనాలు

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే

WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?