అన్వేషించండి

Viral Video: లేడీ ఫ్యాన్‌కు విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ - భుజంపై చెయ్యి వేసి, కుశలమడిగిన స్టార్ క్రికెటర్

Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లేడీ ఫ్యాన్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. జనంలో కలిసిపోయిన కోహ్లీ ఆమెతో మాట్లాడారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Kohli News: ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద యెత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఏ దేశానికైనా భారత జట్టు టూర్‌కి వెళ్తుందంటే కింగ్ కోహ్లీ వస్తున్నాడని అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది. నిర్వాహకులు కూడా కోహ్లీ వస్తున్నాడని టికెట్లు అమ్మడానికి ట్రై చేస్తుంటారు. ఆ మేరకు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇక దేశంలో బయట చాలా అరుదుగా కోహ్లీ సంచరిస్తుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఇండియాకు చేరుకున్న విరాట్.. తన ఫ్యామిలీతో కలిసి జాలీగా గడుపుతున్నాడు. ఇప్పటికే యూపీలోని వృందావన్‌లో ఉన్న స్వామి ప్రేమానంద్ మహారాజ్‌ను కోహ్లీ, అతని భార్య, సినీ నటి అనుష్క శర్మ, వాళ్ల పిల్లలు వామిక, ఆకాయ్‌లతో కలిసి దర్శించుకున్నారు. ఆ తర్వాత సడెన్‌గా ముంబై వచ్చిన కోహ్లీ, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర దర్శనమిచ్చాడు. జనంలో కలిసిపోయిన కోహ్లీ, ఒక లేడీ అభిమాని పక్కనే నిలుచున్నాడు. సడెన్‌గా తన పక్కన కోహ్లీ కనిపించడంతో ఆ లేడీ అభిమాని ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అభిమానులు లైకులతో పాటు తమకు తోచిన కామెంట్లను జోడిస్తూ, ఆ క్లిప్పింగ్‌ను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ ట్రెండింగ్‌లో ఉంది. 

ఇంతకీ ఆ వీడియలో ఏముందంటే..
గేట్ వే ఆఫ్ ఇండియాలో ఒక ప్రదేశంలో సముద్రాన్ని ఆనుకుని ఒక గోడ ఉంది. అక్కడ చాలామంది గుమి గూడారు. ఇంతలో ఒక యువతి పక్కన నల్లని బట్టలు, టోపీ పెట్టుకుని కోహ్లీ కనిపించాడు. అతడిని చూసిన ఒక యువతి అతను కోహ్లీయేనా..? అనే ఆలోచనలో పడింది. ఆమె సందేహాన్ని గమనించిన కోహ్లీ చొరవ తీసుకుని, ఆమె భుజంపై చేయి వేసి, ఏదో మాట్లాడటం కనిపించింది. స్వయంగా కోహ్లీ తనతో మాట్లాడటంపై ఆ అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. తన ఎక్సప్రెషన్స్ ప్రైస్ లెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన జీవితంలో అత్యంత మధుర మైన మూమెంట్లలో ఇదొకటని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

రెస్ట్ మోడ్‌లో కోహ్లీ..
ఆసీస్ టూర్ ముగిశాక లభించిన విశ్రాంతితో కోహ్లీ సేదతీరుతున్నాడు. నిజానికి ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ జరగబోతున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఆ సిరీస్‌లో తను ఆడటం లేదు. వచ్చే నెల 6 నుంచి ఇంగ్లాండ్‌తోనే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు. వచ్చే నెల 19 నుంచి జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో సత్తా చాటి విమర్శకుల నోర్లు మూయించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. మరోవైపు గతేడాది వైఫల్యాల బాట పట్టిన టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీకి ఈ వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ చాలా ముఖ్యం. ఇందులో విపలమైతే వారిపై వేటు వేయడం ఖాయమని ఊహగానాలు చెలరేగుతున్నాయి. 

Also Read: Kohli Vs Yuvraj: యువీకి కోహ్లీనే పొగపెట్టాడు - రిటైర్మెంట్ ప్రకటించడానికి విరాటే కారణమని బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget