Pujara Comments: టీమిండియా అందులో బలహీనంగా ఉంది.. సరి చేసుకుంటేనే సిరీస్ లో ముందంజ
మెల్ బోర్నోలో జరిగే నాలుగో టెస్టులో గెలవడం ఇరుజట్లకు ముఖ్యం. ఈ మ్యాచ్ గెలిస్తే అటు సిరీస్ లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకోవడంతోపాటు ప్రపంచటెస్టు చాంపియన్ షిప్ లో ముందంజ వేయొచ్చు.
Ind Vs Aus Test Series: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ పోటాపోటీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో పాటు మరో మ్యాచ్ డ్రా కావడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. ఈనెల 26 నుంచి నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టు మెల్ బోర్న్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై సీనియర్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. మరోవైపు సిరీస్ లో 21 వికెట్లతో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. తను రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, ఒకసారి నాలుగు వికెట్లతో సిరీస్ లో సత్తా చాటాడు. కేవలం 10 యావరేజీతో వికెట్లు తీయడం గమనార్హం. అయితే అతనికి సహచరుల నుంచి మద్ధతు లభించడం లేదు.
బుమ్రాకు మద్ధతు కావలి..
ఈ సిరీస్ లో అన్ ప్లేయబుల్ గా నిలిచిన బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి మద్ధతు కావాలని పుజారా సూచించాడు. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ ప్రస్తుత తుది జట్టులో ఆడుతున్నారు. అయితే బుమ్రా కొనసాగించినట్లుగా ఒత్తిడిని మిగతా బౌలర్లు చేయడం లేదని పుజారా అన్నాడు. బుమ్రాకు సహకారం అందిస్తేనే భారత్ సత్తా చాటగలదని విశ్లేషించాడు. ఈ విషయంలో భారత్ బలహీనంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. మరోవైపు నాలుగో బౌలర్ గా తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడని, అయిదో బౌలర్ గా రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగతున్నారని వీరు కూడా అంతగా ప్రభావం చూపించలేక పోతున్నారని విశ్లేషించాడు. నాలుగో టెస్టులో వేరే మార్పులు చేయడానికి కూడా అవకాశం లేదని పేర్కొన్నాడు.
Also Read: Tanush Kotian: అశ్విన్ ప్లేసులోకి ముంబై యువ స్పిన్ ఆల్ రౌండర్.. బ్యాట్, బంతితోనూ సత్తా చాటగల ప్లేయర్
టాపార్డర్ విఫలం..
టాపార్డర్ లో పరుగులు రావడం లేదని, మొదటి ఆరుగులు బ్యాటర్లు సత్తా చాటలేకపోతున్నారని, ఈ విషయంలో కేఎల్ రాహుల్ కాస్త బెటరని పుజారా పేర్కొన్నాడు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ నుంచి మొదలు పెడితే, లోయర్ ఆర్డర్ వరకు కూడా బ్యాటింగ్ చేస్తున్నారని ఈ క్రమంలో వీరిని జట్టులో నుంచి పెకిలించే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయలేకపోతుందని, అందువల్ల వివిధ కాంబినేషన్లను భారత్ పరీక్షించ లేకపోతోందని పేర్కొన్నాడు. టెస్టు మ్యాచ్ గెలవాలంటే ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేస్తేనే ఫలితం ఉంటుందని, ప్రస్తుత భారత బౌలింగ్ లైనఫ్ లో ఆ దమ్ము కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా జట్టు సరికొత్త వ్యూహాలతో బుమ్రాకు కాస్త తోడ్పాడు అందించే విధంగా బౌలర్లు సత్తా చాటితేనే సిరీస్ లో టీమ్ ముందంజ వేయగలదని పుజారా సూచించాడు.