అన్వేషించండి

Vaibhav Sooryavanshi: చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!

Vaibhav Sooryavanshi:కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ రికార్డులను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ పరిశోధన ప్రారంభించింది. అతని మైండ్‌సెట్, క్రమశిక్షణ ఇప్పుడు మేనేజ్మెంట్ విద్యార్థులకు పాఠంకానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐఐఎం ఇండోర్, 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై పరిశోధన ప్రారంభించింది.
  • అతని మానసిక దృఢత్వం, ఒత్తిడిని తట్టుకునే విధానం ప్రధానాంశం.
  • అసాధారణ ఐపీఎల్ ప్రదర్శన, చిన్న వయసులోనే విజయం సాధించాడు.
  • ఈ కేస్ స్టడీ భవిష్యత్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు నాయకత్వ పాఠాలు.

Vaibhav Sooryavanshi: సాధారణంగా ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాల విజయగాథలు లేదా విఫలమైన స్టార్టప్‌ల కేస్ స్టడీలపై పరిశోధనలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక 15 ఏళ్ల కుర్రాడి ప్రయాణం, అతని మానసిక దృఢత్వం దేశంలోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్‌ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. అతనే బిహార్‌ నుంచి వచ్చిన క్రికెట్ సంచలనం వైభవన్ సూర్యవంశీ. ఐపీఎల్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాడిపై ఐఐఎం ఇండోర్‌ ప్రత్యేక పరిశోధన చేపట్టింది. 

ఐఐఎం ఇండోర్ నిర్వహిస్తున్న ఈ పరిశోధనకు వైభవ్ సూర్యవంశీ: మైండ్‌సెట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ అని పేరు పెట్టారు. మైదానంలో వైభవ్ ప్రదర్శించే బ్యాటింగ్ నైపుణ్యం మాత్రమే కాదు. అతని మానసిక పరిపక్వత, ఒత్తిడిని తట్టుకునే విధానం, అతని నిర్ణయాధికారంపై పరిశోధనలు దృష్టి పెట్టనున్నారు. 

గత ఐపీఎల్‌ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఆ లెక్కలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం 17 మ్యాచ్‌లలోనే 700 పరుగుల కంటే ఎక్కువ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ, పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో అతి చిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. 

సక్సెస్ మంత్రం ఏంటీ?

బిహార్‌లోని సమస్తిపూర్‌ నుంచి వచ్చిన ఈ బాలుడు ఇంత తక్కువ కాలంలోనే అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు అనే అంశంపై ఐఐఎం పరిశోధనలు చేయనుంది. తన ఇంటి ముందు చిన్న మైదానంలోనే ప్రాక్టీస్ చేసిన వైభవ్ దేశవాళీ క్రికెట్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్‌ కంట పడే వరకు పడ్డ శ్రమ సామాన్యమైంది కాదు. ఒక విజయవంతమైన స్టార్టప్ ఎలాగైతే దశలవారీగా ఎదుగుతుందో, వైభవ్ కెరీర్ కూడా అలాగే సాగిందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అతని రోజువారీ కార్యక్రమాలు, క్రమశిక్షణ, లక్ష్యం పట్ల ఉన్న అంకితభావం ఏ రంగంలోనైనా విజయానికి ప్రాతిపదిక అని ఐఐఎం భావిస్తోంది. 

పరిశోధన ఎలా సాగుతుంది?

ఈ పరిశోధనలో భాగంగా వైభవ్ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్, రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్‌, స్పోర్ట్స్ సైకాలజిస్టులను ఇంటర్వ్యూలు చేస్తారు. అతని మైండ్‌సెట్‌ను విశ్లేషించి, ఒక పూర్తి స్థాయి కేస్‌ స్టడీని రూపొందిస్తారు. ఇది భవిష్యత్‌లో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, ఒత్తిడి నిర్వహణ పాఠాలుగా ఉపయోగపడుతుంది. 

ముగ్దుడైన విరాట్ 

వైభవ్ ప్రతిభకు ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ, అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్యాలరీ నుంచి కిందకు వచ్చిన వైభవ్, కోహ్లీని చూసి చేతులు జోడించి నమస్కరించాడు. వెంటనే విరాట్ అతడిని దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించేందుకు అవసరమైన చిట్కాలను అందించాడు. ఈ గౌరవభావం, నేర్చుకోవాలనే తపన కూడా వైభవ్‌ వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతున్నాయి. 

కేవలం ఆటగానేకాదు, ఒక మేనేజ్‌మెంట్‌ స్టడీగా మారడం అంటే వైభవన్ సూర్యవంశీ సాధించిన విజయం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. బిహార్‌లోని మారుమూల గ్రామం నుంచి ఇండోర్‌లోని ఐఐఎం తరగతి గదుల వరకు సాగిన ఈ ప్రయాణం, ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపిస్తోంది. 

Frequently Asked Questions

ఐఐఎం ఇండోర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఎందుకు పరిశోధిస్తోంది?

ఐఐఎం ఇండోర్ సాధారణంగా కార్పొరేట్ దిగ్గజాలపై పరిశోధనలు చేస్తుంది. అయితే వైభవ్ 15 ఏళ్ల వయస్సులో సాధించిన విజయం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వారి దృష్టిని ఆకర్షించాయి. అతని విజయ ప్రయాణాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నారు.

ఈ పరిశోధన పేరు ఏమిటి మరియు దాని ప్రధాన అంశాలు ఏమిటి?

ఈ పరిశోధన పేరు

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ముఖ్యమైన ప్రదర్శనలు ఏమిటి?

గత ఐపీఎల్ సీజన్‌లో, వైభవ్ 17 మ్యాచ్‌లలో 700 పరుగులకు పైగా చేశాడు. ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు కొట్టి, 200 పైన స్ట్రైక్ రేట్‌తో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

ఐఐఎం పరిశోధన ఎలా నిర్వహిస్తుంది?

ఈ పరిశోధనలో భాగంగా, వైభవ్ కుటుంబ సభ్యులు, చిన్ననాటి కోచ్, రాజస్థాన్ రాయల్స్ స్టాఫ్, స్పోర్ట్స్ సైకాలజిస్టులను ఇంటర్వ్యూ చేస్తారు. అతని మైండ్‌సెట్‌ను విశ్లేషించి కేస్ స్టడీని రూపొందిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget