అన్వేషించండి
Advertisement
U19 World Cup: నేడే ప్రపంచకప్ సెమీస్ , భారత్‌కు ఎదురుందా ?
ICC U19 World Cup semis: అండర్ 19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది.
India vs South Africa U-19 World Cup Semi-final: అండర్ 19 ప్రపంచకప్(ICC U19 World Cup)లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా(Team India)న దక్షిణాఫ్రికా(South Africa)తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. అదే జోరు సెమీఫైనల్‌లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పటిష్టంగా యువ భారత్
ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ –19 వరల్డ్ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(Musheer Khan) అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు , మరో అర్థ సెంచరీతో జోరుమీదున్నాడు. అయిదు మ్యాచుల్లో 334 పరుగులు చేసిన ముషీర్ ఈ టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ కూడా 304 పరుగులు చేశాడు. బౌలర్ సౌమి కుమార్ పాండే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 2.17 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు.
సెమీస్ చేరిందిలా...
సూపర్ సిక్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి సత్తా చాటింది. న్యూజిలాండ్‌పై 214 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 295 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 28.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌట్ అయింది. 126 బంతుల్లో మూడు సిక్సులు, 13 ఫోర్లు సహాయంతో 131 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ సెంచరీ చేశాడు. రెండో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నేపాల్( Nepal)పై 132 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకొచ్చింది. గ్రూప్ దశలో మూడు, సూపర్ సిక్స్‌లో ఒక మ్యాచ్ నెగ్గిన భారత్.. తాజా విజయంతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 298 పరుగుల ఛేదనలో నేపాల్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత యువ స్పిన్నర్ సౌమీ పాండే 4 వికెట్లతో చెలరేగాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉదయ్ సహరన్ (100; 107 బంతుల్లో 9×4), సచిన్ దాస్ (116; 101 బంతుల్లో 11×4,3×6) శతకాలతో మెరిశారు.
ఇతడితో జాగ్రత్త
దక్షిణాఫ్రికా బౌలర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ సింగిల్ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసిన మసాకా... వెస్టిండీస్‌పై 38 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మపాకా బుల్లెట్ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. ఇటీవలే జస్ప్రీత్ బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని మసాకా సవాల్ కూడా చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion