అన్వేషించండి

Ind Vs Aus Test Series: ప్రాక్టీస్ పిచ్ ల లొల్లి.. భారత్‌కు పాతవి, ఆసీస్ కు కొత్తవి కేటాయింపు- అభిమానుల గుస్సా

నాలుగో టెస్టుల విజయం సాధించలనే పట్టుదలతో ఇరు జట్లు మెల్ బోర్న్ లో ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ లో తిరుగలేని ఆధిక్యాన్ని దక్కించుకుంటుంది. 

Melbourne Test: భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరుజట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రాక్టీస్ పిచ్ ల విషయంలో వివాదం మొదలైంది. ముఖ్యంగా భారత ప్లేయర్లు ఆడుతున్న ప్రాక్టీస్ పిచ్లను చూసి అభిమానులు పెదవి విరుస్తున్నారు. టీమిండియా ప్లేయర్లకు ఆల్రెడీ వాడేసిన పిచ్ లను ప్రాక్టీస్ కోసం కేటాయిస్తున్నారని, అదే ఆసీస్ ఆటగాళ్లకు మాత్రం తళతళలాడుతున్న కొత్త ప్రాక్టీస్ పిచ్ లను ఇచ్చారని వాదనలు మొదలయ్యాయి. గత వారం నుంచి భారత జట్టు మెల్ బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆసీస్ మాత్రం సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టింది. రెండు జట్ల పిచ్ లకు సంబంధించి క్లిప్పింగ్ లను అభిమానులు సోషలో మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

లో బౌన్స్, కష్టాలు..
ఇక వాడేసిన ప్రాక్టిస్ పిచ్ ల వల్ల కొన్ని నష్టాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఊహించినంత బౌన్స్ అందులో రాదని, ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేసినప్పటికీ, అవి బ్యాటర్ నడుం కంటే తక్కువ ఎత్తుకే వస్తాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలి గాయానిక గురయ్యాడని పేర్కొంటున్నారు. మరికొందరు బ్యాటర్లు అసౌకర్యానికి గురయ్యారని తెలుస్తోంది. మరోవైపు తాజాగా పేసర్ ఆకాశ్ దీప్ ఈ వివాదంపై  స్పందించాడు. తమకు యూస్డ్ పిచ్ లు ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. ఆ పిచ్ లు వైట్ బాల్ క్రికెట్ కోసం తయారు చేసినవని, అందుకే బౌన్స్ అంతగా రావట్లేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఆటలో ఇవన్నీ సహజమని తేలిగ్గా తీసుకున్నాడు. 

నిబంధనల ప్రకారమే..
ప్రాక్టీస్ పిచ్ ల వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు చెందిన మెల్ బోర్న్ క్యూరేటర్ మ్యాట్ పేజ్ స్పందించాడు. నిబంధనల ప్రకారం కొత్త ప్రాక్టీస్ పిచ్ లను మ్యాచ్ కు మూడు రోజుల ముందుగానే ఆటగాళ్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. భారత జట్టు గత వారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించిందని, అందుకే వాళ్లు ఆడుతున్న ప్రాక్టీస్ పిచ్ లు పాతగా కనిపిస్తున్నాయని తెలిపాడు. ఇక మ్యాచ్ కు మూడు రోజులు ముందు అంటే సోమవారం ఆసీస్ ప్రాక్టీస్ మొదలు పెట్టినందున వారికి కొత్త ప్రాక్టీస్ పిచ్ లు కేటాయించామని తెలిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్ల సాధన నేపథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. వాళ్లు మళ్లీ సాధన మొదలు పెట్టినప్పుడు ఏ పిచ్ పై ప్రాక్టీస్ చేస్తున్నారో చూస్తూ అసలు నిజం తెలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఐదు టెస్టుల సిరీస్ పసందుగా జరుగుతోంది. ఇరుజట్లు పోటాపోటీగా ఆడుతుండటంతో సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టును 295 పరుగులతో భారత జట్టు దక్కించుకోగా, పది వికెట్లతో రెండో టెస్టును ఆసీస్ తన ఖాతాలో వేసుకుంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్ లో నాలుగో టెస్టు ఈనెల 26న బాక్సింగ్ డే రోజున మెల్ బోర్న్ లో జరుగుతుంది. 

Also Read: Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget