By: ABP Desam | Updated at : 02 Jan 2023 01:18 AM (IST)
Edited By: nagavarapu
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (source: twitter)
Team India: 2023 కొత్త సంవత్సరంపై భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ ఏడాది టీమిండియా క్రికెట్ కు చాలా ప్రత్యేకమైనది. 13 ఏళ్ల తర్వాత భారతదేశం వన్డే ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు కప్ గెలిచింది కూడా 2011లో స్వదేశంలో టోర్నీ జరిగినప్పుడే. ఆ సెంటిమెంట్ కలిసొచ్చి ఇప్పుడు కూడా టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలానే అన్నీ ఓకే అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ తలపడనుంది. పోయినసారి రన్నరప్ తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి ఆ టోర్నీలోనూ విజయం సాధించాలని భారత క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇంకా ఈ ఏడాది మన క్రికెట్ అభిమానులు జట్టు నుంచి ఏం ఆశిస్తున్నారో చూద్దామా...
వన్డే ప్రపంచకప్ ట్రోఫీ
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ లోనే జరగనుంది. 13 ఏళ్ల క్రితం 2011లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పుడే ధోనీ సారథ్యంలోని టీమిండియా జట్టు కప్పును ముద్దాడింది. అలానే ఇప్పుడు కూడా ఈ మెగా ట్రోఫీని భారత్ గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్ రోహిత్ శర్మ నేతృత్వంలో బరిలోకి దిగనుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్
ఈ ఏడాది జూన్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతమున్న పాయింట్ల ప్రకారం భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంచనాల ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది. పోయినసారి జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఆ ట్రోఫీని భారత్ గెలుచుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఐపీఎల్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే
మహేంద్రసింగ్ ధోనీ- ఈ టీమిండియా మాజీ ఫినిషర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ బ్యాట్ నుంచి ఫినిషింగ్ ఇన్నింగ్స్ లను మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తనదైన స్టైల్లో మ్యాచులతో పాటు ఐపీఎల్ కెరీర్ ను ముగించాలని ఆశిస్తున్నారు.
వింటేజ్ ఆట రావాల్సిందే
వన్డేల్లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీలు గతంలో ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. మ్యాచ్ విన్నింగ్ పార్ట్ నర్ షిప్ లను నమోదు చేశారు. అయితే చాలాకాలంగా వీరిమధ్య అలాంటి భాగస్వామ్యాలు కనిపించడంలేదు. ఈ ప్రపంచకప్ లో నైనా గతంలో మాదిరిగా వీరిద్దరూ గొప్ప భాగస్వామ్యాలను అందించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Signing off 2️⃣0️⃣2️⃣2️⃣ in THALA Style 💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/LFRgGRzudU
— Chennai Super Kings (@ChennaiIPL) December 31, 2022
What do you want in 2023 ?
— CRICKET CANNON (@cricketcannon) January 1, 2023
We all Indian cricket fans want to see India Lift the ICC WC TROPHY after 12 years which is to be held in India ! And Kohli and Rohit to be lifted by teammates and have a befitting farewell in ODIs ! #newyearresolution2023 #WorldCup2023 pic.twitter.com/TauavakbHX
India vs England Women’s 1st T20I: టీమిండియా మహిళలకు తొలి సవాల్ , ఇంగ్లండ్‌తో తొలి టీ 20 నేడే
Ganguly vs Virat Kohli: కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన దాదా
Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
IND vs AUS: టీమిండియా క్రికెట్ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?
BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు
Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
/body>