అన్వేషించండి

Suryakumar Yadav: అభిషేక్ శర్మ గురించి కాదు, వారి గురించి టెన్షన్ పడుతున్నాను: సూర్యకుమార్ యాదవ్

Ind vs SA Suryakumar yadav on abhishek sharma Form | భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫాం గురించి తాను ఆందోళన చెందడం లేదని, అతడి తరువాత మ్యాచులలో ప్రత్యర్థి జట్ల గురించే తన టెన్షన్ అన్నాడు సూర్యకుమార్ యాదవ్.

T20 world cup 2026 | అహ్మదాబాద్: టీమిండియా మ్యాచ్ అంటే చాలు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే మేనేజ్‌మెంట్ నుంచి అభిషేక్ శర్మకు కావాల్సినంత సపోర్ట్ లభిస్తోంది. అభిషేక్ శర్మ డకౌట్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సరదాగా స్పందించాడు. తాను ఆందోళన చెందుతున్నది అభిషేక్ శర్మ ఫామ్ గురించి కాదని, ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందుతున్నానని తనదైనశైలిలో బదులిచ్చాడు. 

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో టీమిండియా మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆదివారం (ఫిబ్రవరి 22న) తలపడనుంది.  మ్యాచ్‌కు ముందు రోజు శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీ20ల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అభిషేక్ శర్మ పేలవ ఫామ్ గురించి ప్రశ్నలు అడిగారు. అభిషేక్ గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయితే ఓపెనర్ బ్యాటర్ గురించి ఎలాంటి ఆందోళన లేదని, కానీ ప్రత్యర్థి జట్ల గురించి తనకు ఆందోళనగా ఉందని కెప్టెన్ సూర్య పేర్కొన్నాడు. 

సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడు
‘అభిషేక్ శర్మ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూసి నేను ఆందోళన చెందుతున్నాను. అభిషేక్ శర్మ భవిష్యత్తులో ఎవరితో ఆడబోతున్నాడో ఆ జట్ల గురించి ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో అతనిని ఎదుర్కోబోయే జట్ల గురించి ఎక్కువ ఆందోళనగా ఉన్నారు. గత సంవత్సరం అభిషేక్ చాలా చేశాడు. ఇప్పుడు అతనికి మేం సహకరించాల్సిన సమయం వచ్చింది’ అని సూర్య మద్దతుగా నిలిచాడు. 

ప్రతి మ్యాచులో 250 పరుగులు చేయాల్సిన అవసరం లేదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వికెట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తదుపరి మ్యాచ్‌లలో వచ్చే పిచ్ సవాళ్లను తాము ఎదుర్కొంటామని తెలిపారు. భారత్ నెదర్లాండ్స్‌పై ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలోనే విజయం సాధించింది, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా కూడా ఈ గ్రౌండ్‌లో 2 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరగనుంది. నెదర్లాండ్స్‌ మ్యాచులో అభిషేక్ వరుసగా మూడవసారి డకౌట్ అయ్యాడు. అంతకుముందు పాకిస్తాన్, అమెరికాలపై కూడా ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు టోర్నీలో ఓడిపోనప్పటికీ, ఇకనుంచి అభిషేక్ పరుగులు చేయడం జట్టుకు అవసరం. కానీ తన ఆటగాడికి కెప్టెన్ నుంచి సపోర్ట్ లభించింది. 

ఎటువంటి వికెట్లకైనా అలవాటు పడటానికి మేం సిద్ధంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. వాంఖడేలో మా జర్నీ  ప్రారంభించినప్పటి నుండి ఆడిన చివరి మ్యాచ్ వరకు పలు రకాల వికెట్లపై ఆడుతూనే ఉన్నాం. ఆ వికెట్లు మరీ ఛాలెంజ్ తో కూడుకున్నవి కాకపోయినా, కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి. అయితే పవర్ ప్లే తర్వాత మేం ఎలా బ్యాటింగ్ చేయాలి, ఆపై మ్యాచ్‌ను ఎలా ముగించాలి అనే దానిపై అవగాహన ఉండటానికి సరిపడా క్రికెట్ ఆడాం - సూర్యకుమార్ యాదవ్

దక్షిణాఫ్రికాపై భారత్ ప్లేయింగ్ 11 అంచనా
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget