అన్వేషించండి

Pak vs NZ T20 world cup: పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్.. ఓడిన జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుందా?

Pakistan vs New Zealand: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ పాకిస్తాన్ vs. న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. రెండు జట్లు సమ ఉజ్జీగా ఉన్నా ఒక్క జట్టే విజేత అవుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ వేటలో ఇంకా 8 జట్లు ఉన్నాయి. మొత్తం 10 జట్లతో టోర్నీ ప్రారంభం కాగా, మిగిలిన 12 జట్లు పొట్టి ప్రపంచ కప్ నుండి నిష్క్రమించాయి. సూపర్-8 రౌండ్ ఈరోజు ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్,  న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈరోజు గెలిచిన జట్టు సెమీఫైనల్ దిశగా తొలి అడుగు వేస్తుంది. అయితే ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుందా.. ? ఈ సూపర్ 8 రౌండ్ పూర్తి ఫార్మాట్ గురించి తెలుసుకోండి.

సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ లీగ్ స్టేజ్‌లో 4 మ్యాచ్‌లలో 3 గెలిచి సూపర్ 8కు చేరుకుంది. లీగ్ స్టేజీలో పాక్ జట్టు భారత్ చేతిలో మాత్రమే ఓడిపోయింది. న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇలాంటిదే. కివీస్ జట్టు తమ టేబుల్ టాపర్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, మిగిలిన 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 రౌండ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ గ్రూప్ 2లో ఉన్నాయి. వీరితో పాటు ఇంగ్లాండ్, శ్రీలంక కూడా ఉన్నాయి. గ్రూప్ 1లో భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

పాక్ లేదా న్యూజిలాండ్ లలో ఏ టీం స్ట్రాంగ్ ?
పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఇప్పటివరకు ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అతను 4 మ్యాచ్‌ల్లో ఏకంగా 220 పరుగులు చేశాడు. ఇందులో నమీబియాపై సెంచరీ కూడా సాధించాడు. టాప్-5 రన్ స్కోరర్లలో న్యూజిలాండ్ బ్యాటర్ ఎవరూ లేరు. టాప్ 5 వికెట్ టేకర్లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు ఎవరూ లేరు.

ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ ఇప్పటివరకు 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 5 గెలిచి, 3 ఓడిపోయింది. ఇదే టీ20 వరల్డ్ కప్‌లో ఇదే గ్రౌండ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. న్యూజిలాండ్ 2009లో చివరిసారిగా ఇక్కడ టీ20 మ్యాచ్ ఆడింది. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ నెగ్గింది.

పాకిస్థాన్ vs న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ (T20)
మొత్తం మ్యాచ్‌లు: 49
పాకిస్థాన్ గెలిచినవి: 24 మ్యాచ్‌లు
న్యూజిలాండ్ గెలిచినవి: 23 మ్యాచ్‌లు

ఓడిపోయిన జట్టు టోర్నీ నుండి వెళ్లిపోతుందా ?
నేడు ఓడిపోయిన జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులోనే ఉంటుంది. ఒక గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని మిగిలిన 3 జట్లతో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత గ్రూప్‌లోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. 3, 4  స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. కానీ ఈరోజు ఓడిపోయే జట్టు తమ తదుపరి రెండు మ్యాచ్‌లను ఖచ్చితంగా గెలవాలి. అలా గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. సూపర్-8లో 3 మ్యాచ్‌లు గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.

న్యూజిలాండ్ స్క్వాడ్
న్యూజిలాండ్: జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే, కోల్ మెక్కోనీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, కైల్ జామిసన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, బెన్ సీర్స్.

పాకిస్థాన్ స్క్వాడ్
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, బాబర్ ఆజం, సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, ఖవాజా నఫే (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిక్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Advertisement

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Embed widget