Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్ వెనుక ట్విస్ట్!
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బిసిసిఐ సీఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ ప్లేయర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్ నిబంధనలపై స్పష్టత ఇచ్చాడు.

VVS Laxman Breaks Silence On Nitish: ఇండియన్ యంగ్ ఆల్‌రౌండర్, తెలుగు స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై నేషనల్ క్రికెట్ అకాడమీ (సీఓఈ) హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఓపెన్ అయ్యాడు. రీసెంట్ గా ప్లేయర్లు ఫ్రీక్వెంట్ గా గాయాలపాలవుతుండటంతో బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ ఆదివారం లక్ష్మణ్ తో స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. ప్రెజెంట్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ ఆల్‌రౌండర్ గా ఉన్న నితీష్ రెడ్డి లెఫ్ట్ క్వాడ్రిసెప్స్ గాయంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ లతో పాటు నితీష్ కూడా సీఓఈ లో రీహాబిలిటేషన్ పొందుతున్నాడు.
🚨 TEAM INDIA INJURY UPDATE! 🇮🇳🏏
— Possible11 (@Possible11team) August 9, 2026
The injury list continues to grow, with several key players currently on the sidelines. 😔💔
🔹 Harshit Rana – Hamstring
🔹 Hardik Pandya – Quadriceps injury/strain
🔹 Jasprit Bumrah – Knee swelling
🔹 Nitish Reddy – Hamstring
🔹 Washington… pic.twitter.com/sJgdkiAAKD
వర్క్‌లోడ్ ప్రెజర్.. ఆల్‌రౌండర్లకు లక్ష్మణ్ స్పెషల్ మెసేజ్
లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ "ఒక ఆల్‌రౌండర్ గా నితీష్ పై వర్క్‌లోడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. గాయాలు కేరియర్ లో కామన్. సీఓఈ లో ప్లేయర్ల మెంటల్ హెల్త్ తో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ప్రెజెంట్ క్రికెట్ కేలండర్ లో ఆఫ్-సీజన్ అనేది ఉండటం లేదు. ఐపీఎల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మ్యాచులు కంటిన్యూయస్ గా ఆడుతున్నప్పుడు లభించే చిన్న బ్రేక్స్ ను ప్లేయర్లు ఫిట్‌నెస్ పెంచుకోవడానికి యూస్ చేసుకోవాలి" అని చెప్పాడు.
🚑 Injured Players Who Will Miss SL vs IND Test Series
— Cricket Hub (@Anurag9793) August 9, 2026
1. Jasprit Bumrah — Knee Swelling
2. Harshit Rana — Hamstring Injury
3. Nitish Kumar Reddy — Hamstring Injury
4. Washington Sundar — Quadriceps Injury
5. Akashdeep — Lower Back Stress Fracture
6. Sai Sudharsan — Toe Stress… pic.twitter.com/YMNBePP84B
యో-యో టెస్ట్ ప్లేస్ లో బ్రోంకో టెస్ట్.. స్ట్రెంగ్త్ కోచ్ అడ్రియన్ కొత్త ప్లాన్
స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లెరూక్స్ ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ గురించి లక్ష్మణ్ కీలక విషయాలు చెప్పాడు. సీజన్ ప్రారంభంలో ప్లేయర్లందరికీ ఫిట్‌నెస్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపాడు. సీరీస్ నడుస్తున్న టైమ్ లో యో-యో టెస్ట్ పెట్టడం వల్ల ప్లేయర్ల బాడీపై హెవీ ప్రెజర్ పడి రికవరీ కష్టమవుతుందని వివరించాడు. అందుకే బాడీ కండిషనింగ్ కి హెల్ప్ అయ్యేలా, అనోరోబిక్ ఫిట్‌నెస్ చెక్ చేసేలా బ్రోంకో టెస్ట్‌ను రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
సీఓఈ మెడికల్ టీమ్ మానిటరింగ్.. యంగ్ స్టార్లకు గైడెన్స్
ఆల్‌రౌండర్లు తమ బౌలింగ్, బ్యాటింగ్ వర్క్‌లోడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫిట్‌నెస్ కంటిన్యూ చేయడం చాలా క్రూషియల్ అని చెప్పక తప్పదు. నితీష్ రెడ్డితో పాటు గాయపడిన మిగతా ప్లేయర్ల రికవరీ ప్రాసెస్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే వాళ్లు నేషనల్ టీమ్ కి అందుబాటులోకి వస్తారని ఇండియన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Before You Go
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















