T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌లో భారత షెడ్యూల్ ఇదే!
T20 World Cup 2024: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన లోగోలను ఐసీసీ విడుదల చేసింది.
T20 World Cup 2024 India full schedule and squad: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన లోగోలను ఐసీసీ విడుదల చేసింది. పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్ లోగోలను విడుదల చేసింది. లోగోలపై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయర్ల ఎనర్జీని సూచించే సంకేతం ఉంది. టీ 20 ప్రపంచకప్‌నకు అంబాసిడర్‌గా ఉసేన్ బోల్ట్‌ను నియమించింది. భారత క్రికెట్ జట్టు కూడా జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను అద్భుతంగా నడిపించిన రోహిత్‌శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కింగ్ కోహ్లీకి కూడా జట్టులో చోటు కల్పించింది. అయితే టీ 20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ మ్యాచులో ఎవరితో ఆడనుందో మరోసారి గుర్తు చేసుకుందాం.
తొలి పోరు ఇలా
జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
ఆ మూడు మ్యాచ్‌లకు..
టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్ మ్యాచ్‌లూ జూన్ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
భారత టీ 20 జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ),సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్య (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్,