T20 World Cup 2022: కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ పై కోచ్ ద్రవిడ్ స్పందన.. ఏమన్నారో తెలుసా!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. మిగిలిన మ్యాచులకు అతన్ని తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఫామ్ పై ద్రవిడ్ స్పందించాడు.
కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడని.. చాలా బాగా బ్యాటింగ్ చేయగలడని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈ విషయం తన గత రికార్డులను చూస్తే అర్థమవుతుందన్నాడు. అయితే టీ20 అనేది ఒత్తిడితో కూడిన గేమ్ అని.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఆ ఒత్తిడి ఇంకా అధికంగా ఉంటుందని ద్రవిడ్ అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డాడు.
రాహుల్ సామర్థ్యమేంటో అందరికీ తెలుసు
రాహుల్ సామర్థ్యం, నైపుణ్యం గురించి అందరికీ తెలిసిన విషయమే అని ద్రవిడ్ అన్నాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో స్టార్క్, కమిన్స్ లాంటి బౌలర్లను ఎదుర్కొని అర్థ శతకం సాధించిన విషయం మరువకూడదన్నాడు. తదుపరి మ్యాచుల్లో కేఎల్ రాహుల్ తప్పకుండా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తంచేశాడు. ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై రాహుల్ చక్కగా సరిపోతాడని ద్రవిడ్ చెప్పాడు. రాహుల్ ఆట గురించి అతనితో చర్చించామని అన్నాడు.
మాకు నమ్మకముంది
టీ20 ప్రపంచకప్ లో జట్టు కోసం రాహుల్ నుంచి ఏం ఆశిస్తున్నామనే దానిపై అతనికి, తమకు స్పష్టత ఉందని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లతో మ్యాచులు ఆడిస్తామని వివరించాడు. బయట ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపై తామసలు దృష్టి పెట్టమని.. ఆ వ్యాఖ్యలను పట్టించుకోమని స్పష్టం చేశాడు. మెగా టోర్నీలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని అన్నాడు. రాహుల్ పై తనకు, కెప్టెన్ కు నమ్మకముందని అన్నాడు. తదుపరి మ్యాచుల్లో తప్పకుండా ఫామ్ ను అందుకుంటాడని విశ్వాసం వ్యక్తంచేశారు.
"We know his quality & ability, he's really well-suited for these conditions!"
— Star Sports (@StarSportsIndia) November 1, 2022
Rahul backs Rahul as Coach Dravid tells the world to #BelieveInBlue and keep faith in KL Rahul's batting talent!
Watch #CricketLive ahead of #INDvBAN tomorrow:
1 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/i1Fa9Vs2md
Virat Kohli talking to KL Rahul during today's practice session in Adelaide. He giving his advice and helping Rahul - Beautiful to see Kohli helping KL in tough time. pic.twitter.com/ODC3P3DO4Z
— CricketMAN2 (@ImTanujSingh) November 1, 2022