Shubman Gill Record Double Century: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు.. రాణించిన జడేజా, జైస్వాల్..
గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. గిల్ తోపాటు జడేజా, జైస్వాల్ అర్ధ సెంచరీలతో రాణించారు.

Ind Vs Eng 2nd Test Day 2 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. గురువారం రెండోరోజు టీ విరామం తర్వాత కాసేపటికే 151 ఓవర్లలో 587 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (387 బంతుల్లో 269, 30 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటాడు. దాదాపు ఐదు సెషన్లతోపాటు బ్యాటింగ్ చేసి, మారథాన్ ఇన్నింగ్స్ తో పలు రికార్డులని బద్దలు కొడుతూ, సూపర్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ 570+ పరుగుల మైలురాయిని దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ కు 3 వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో మాదిరిగా కాకుండా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పరుగులు సాధించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗔𝗹𝗲𝗿𝘁 🚨
— BCCI (@BCCI) July 3, 2025
Highest Score for a #TeamIndia captain in an innings of a Test match 🔝
Well done, Captain Shubman Gill 🙌 🙌
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/oxCSBXOEvR
సూపర్ భాగస్వామ్యం..
గురువారం రెండోరోజు ఉదయం ఓవర్ నైట్ స్కోరు 310/5 తో ఆటను కొనసాగించిన భారత్ గిల్, రవీంద్ర జడేజా(89) జోడీ మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జంట.. ఆ తర్వాత కాస్త వేగంగా ఆడింది. దీంతో మంచి వేగంతో పరుగులు వచ్చాయి. అలా అలా బ్యాటింగ్ చేస్తూ, గిల్ 150 పరుగుల మార్కును, జడేజా ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత తన మార్కు కత్తి సాముతో జడేజా అలరించాడు. ఆ తర్వాత కూడా జోరును కొనసాగించిన ఈ జంట బాగా బ్యాటింగ్ చేసింది. అయితే లంచ్ విరామానికి కాస్త ముందు జడేజాను షార్ప్ బౌన్సర్ తో జోష్ టంగ్ పెవిలియన్ కు చేర్చాడు. దీంతో సెంచరీకి ముందు జడేజా ఔట్ కాగా, 203 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మారథాన్ ఇన్నింగ్స్..
జడేజా ఔటైన తరవాత వాషింగ్టన్ సుందర్ (41) తో కలిసి గిల్ మరో సూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బుధవారం తొలిరోజు లంచ్ విరామానికి కాసేపు ముందు బ్యాటింగ్ కు దిగిన శుభమాన్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు సెషన్లపాటు బ్యాటింగ్ చేసి, రికార్డు డబుల్ సెంచరీని నమోదు చేశాడు. సేనా దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన ఆసియన్ కెప్టెన్ గా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన సునీల్ గావస్కర్ (221) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే సేనా దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఇండియన్ గా సచిన్ టెండూల్కర్ (241) పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు. చివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ (254 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టి, ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సుందర్ ను జో రూట్ ఔట్ చేశాడు.దీంతో ఏడో వికెట్ కు నమోదైన 144 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే చివర్లో టెయిలెండర్లు ఉండటంతో వేగంగా పరుగులు చేయాలని భావించి, 269 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ గా గిల్ ఔటయ్యాడు. కాసేపటికే ఇండియన్ టెయిలెండర్లు కూడా ఔటవడంతో భారత్ ఇన్నింగ్ స్ ముగిసింది.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















